Jalahalli Incident: బూతు పనులకు అడ్డాగా మెట్రో స్టేషన్లు.. మహిళ ముందు ఉద్యోగి 'పాడు పని'

Jalahalli Metro Station Masturbating: గమ్యం త్వరగా చేర్చే మెట్రో రైలులో దారుణ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మెట్రో స్టేషన్‌లు పార్క్‌లుగా మారుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి స్టేషన్‌లో మహిళను చూస్తూ అసభ్యకర సైగలు చేస్తూ 'పాడు పని' చేశాడు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 20, 2024, 05:05 PM IST
Jalahalli Incident: బూతు పనులకు అడ్డాగా మెట్రో స్టేషన్లు.. మహిళ ముందు ఉద్యోగి 'పాడు పని'

Jalahalli Station: ప్రజా రవాణాలో కీలకంగా నిలుస్తున్న మెట్రో స్టేషన్‌లు అసభ్య కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. ఢిల్లీ, హైదరాబాద్‌, బెంగళూరు తదిర మెట్రో నగరాల్లో కొందరు అసభ్యకర పనులు చేస్తూ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మెట్రో స్టేషన్‌లను యువత పార్క్‌లుగా భావిస్తూ రెచ్చిపోతున్నది. ఖాళీగా ఉండే స్టేషన్‌లు, మెట్రో రైళ్లలో రాసలీలలు కొనసాగిస్తున్నారు. తాజాగా బెంగళూరు మెట్రోలో మరో ఘటన చోటుచేసుకుంది. ఇప్పుడు మెట్రో సిబ్బందే పాడు పనికి పాల్పడ్డాడు. ఇదంతా వీడియో తీసి మెట్రో అధికారులకు ఫిర్యాదు చేయడంతో అతడు చేసిన నిర్వాకం బయటపడింది.

Also Read: Farmer: 'మెట్రో'లో రైతుకు ఘోర అవమానం.. 'మురికి బట్టలు' ఉన్నాయని రైలు ...

బెంగళూరులోని జలహళ్లి మెట్రో స్టేషన్‌ ఉంది. ఈ స్టేషన్‌లో రైలు ఎక్కేందుకు మధ్యాహ్నం 2 నుంచి 2.30 గంటల మధ్యలో ఓ మహిళ వచ్చారు. మధ్యాహ్నం కావడంతో స్టేషన్‌లో తక్కువ సంఖ్యలో ప్రయాణికులు ఉన్నారు. అయితే ఈ మహిళను చూస్తూ ఎదురుగా ఉన్న ప్లాట్‌ఫామ్‌లో మెట్రో సిబ్బంది రెచ్చిపోయాడు. అసభ్య చేష్టలు.. సైగలతో ఆమెను ఇబ్బందులకు గురి చేశాడు. దూరం నుంచే అసభ్య చేష్టలు చేశాడు. అనంతరం మెల్లగా ప్యాంట్‌లోకి చేయి పెట్టి స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌లోనే 'హస్త ప్రయోగం' చేసుకున్నాడు. ఇదంతా ఆ మహాళ సెల్‌ఫోన్‌లో వీడియో తీసింది. అనంతరం నమ్మ బెంగళూరు అధికారులకు బాధిత మహిళ మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేసింది.

Also Read: Ice Cream Semen: ఛీ.. ఛీ.. నడిరోడ్డుపై 'ఆ పని' కానిచ్చేసి ఐస్‌క్రీమ్‌లో వీర్యం కలిపిన యువకుడు

ఏమిటీ దారుణం?
'నాకు ఈరోజు మెట్రో స్టేషన్‌లో సెక్యూరిటీ గార్డు వలన తీవ్ర అభ్యంతకర సంఘటన ఎదురైంది. జలహళ్లీ మెట్రో స్టేషన్‌లో మధ్యాహ్నం 2.30 సమయంలో ఎదురుగా ఉన్న ప్లాట్‌ఫామ్‌లో సెక్యూరిటీ గార్డు అసభ్య చేష్టలు చేశాడు. తర్వాత తన రహాస్య భాగాలపై చేయి వేసి దారునంగా ప్రవర్తించాడు. ఈ పరిణామం నాకు చాలా ఇబ్బందికి గురి చేసింది. దీనిపై అతడిని నిలదీయగా మరింత రెచ్చిపోయాడు. అందుకే వీడియో తీశాను. పగటిపూట కూడా ఇలాంటి పరిస్థితులు ఉండడం దారుణం' అని ఆ మహిళ మెట్రో అధికారులకు మెయిల్‌ పంపారు. మహిళ ఫిర్యాదును పరిశీలించిన మెట్రో అధికారులు అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 'వీడియోలో అతడు స్పష్టంగా తెలియడం లేదు. విచారణ చేసి అతడిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం' అని బెంగళూరు మెట్రో అధికారి యశ్వంత్‌ చవాన్‌ తెలిపారు. కాగా ఇటీవల మెట్రో రైలులో రైతును ఎక్కకుండా చేసిన సంఘటన తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News