Rajanna Sircilla Family Death: సిరిసిల్ల జిల్లాలో ఘోర విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
Rajanna Sircilla Suicide Case: ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. డబ్బుల కోసం భర్త వేధించడంతో ఆమె ఈ దారుణ నిర్ణయం తీసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
Rajanna Sircilla Suicide Case: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. బోయినపల్లి మండలంలోని కొదురుపాక ఫోర్ లేన్ బ్రిడ్జి వద్ద మిడ్‌మానేరులో ముగ్గురు పిల్లలతో కలిసి దూకి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. శభాష్‌పల్లి వద్ద మిడ్‌మానేరులో మృతదేహాలు తేలియాడుతుండగా.. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను బయటకు తీయించారు. మృతులను తల్లి రజిత, ఆమె కుమారులు ఉస్మాన్ అహ్మద్ (14), మహమ్మద్ అయాన్ (7), అసరాజా బిన్ (5 నెలలు)గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివరాలు ఇలా..
కరీంనగర్‌లోని సుభాష్ నగర్‌కి చెందిన మహ్మద్ అలీ, వేములవాడ అర్బన్ మండలం రుద్రవరానికి చెందిన రజిత తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే వివాహం జరిగిన తరువాత నుంచి దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతూ వస్తున్నాయి. దీంతో గొడవలు తాళలేక రజిత తన పుట్టింటి వాళ్లకు చెప్పింది. మహ్మద్ అలీపై వేములవాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలీని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. భార్యాభర్తలు రాజీ కావడంతో కేసు కొట్టేసి ఇంటికి పంపించారు.
డబ్బుల కోసం మళ్లీ రజితను వేధించిన అలీ.. మూడు రోజుల క్రితం పుట్టింట్లో దించి వెళ్లాడు. డబ్బులు తీసుకువస్తేనే తనకు వద్దకు రావాలసి స్పష్టం చేసి వెళ్లిపోయాడు. తమ వద్ద కూడా డబ్బులు లేవని పుట్టింటి వాళ్లు చెప్పి.. భర్త వద్దకు వెళ్లాలని సూచించారు. దీంతో అటు భర్త వద్దకు వెళ్లలేక.. ఇటు పుట్టింట్లో ఉండలేక మనస్థాపం చెందిన రజిత.. ముగ్గురు పిల్లలను తీసుకుని మిడ్‌మానేర్‌లో దూకి ప్రాణాలు తీసుకుంది. ఒకేసారి నలుగురు మరణించడం స్థానికంగా తీవ్రవిషాదం నింపింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని.. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
Also Read: Ambati Rayudu News: రాజకీయ రంగ ప్రవేశంపై అంబటి రాయుడు కీలక ప్రకటన
Also Read: Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌ను వీడిన అజిత్ అగార్కర్, షేన్ వాట్సన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి