Baby Of Mother Commits Suicide: గత నెలలో బాల్కానీ రేకులపై చిన్నారి ప్రమాదవశాత్తు పడిన సంఘటన గుర్తుండే ఉంటుంది. బాలుడిని అతికష్టంగా స్థానికులు కాపాడిన విషయం తెలిసిందే. అయితే చంటి పాపను కాపాడుకోకపోవడం.. అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన బిడ్డను గాలికొదిలేసిందంటూ సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ మొదలయ్యాయి. ఆ ఘటన జరిగిన నాటి నుంచి ట్రోల్స్‌ తీవ్రమవడంతో పాప తండ్రి తీవ్ర మనోవేదనకు లోనయ్యింది. ఈ క్రమంలో ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Footboard Journey: ప్రాణం తీసిన 'ఉచిత బస్సు' పథకం.. ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తూ మహిళ దుర్మరణం


చెన్నైలోని తిరుముల్లైవాయల్‌లో వెంకటేశ్‌ (35), రమ్య (33) దంపతులు నివసిస్తున్నారు. వారిద్దరూ ప్రముఖ ఐటీ కంపెనీల్లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు పనిచేస్తున్నారు. వారికి 7 నెలల చిన్నారి ఉంది. ఏప్రిల్‌ 28వ తేదీన తిరుముల్లైవాయల్‌లో తాము ఉంటున్న అపార్ట్‌మెంట్ బాల్కనీ రేకులపై చిన్నారి పడిపోయింది. ఇది చూసిన స్థానికులు భయాందోళన చెందారు. పాపను అతికష్టంగా అపార్ట్‌మెంట్‌వాసులంతా కలిసి రక్షించారు.

Also Read: Serial Actor Chandu: త్రినయని నటుడు చందు ఆత్మహత్య.. పవిత్ర జయరాం మృతి తట్టుకోలేక బలవన్మరణం


అయితే ఆ సంఘటన జరిగిన రోజు నుంచి పాప తల్లి రమ్య తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో భర్త వెంకటేశ్‌ తన భార్యను పిల్లలతో సహా స్వగ్రామం కరమడైకి తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లాక కూడా రమ్యను ట్రోల్స్‌ వెంబడించాయి. స్థానికులు కూడా సూటిపోటీ మాటలు మాట్లాడుతున్నారు. ఇది చూడలేక రమ్యకు తండ్రి వాసుదేవన్ కౌన్సిలింగ్‌ ఇచ్చారు. తీవ్ర మనో వేదన చెందకుండా కొంత కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా కూడా సోషల్ మీడియాలో ఆ ట్రోల్స్‌ చూసి రమ్య కుంగిపోయింది.


ఆదివారం ఓ శుభాకార్యానికి తల్లిదండ్రులు వెళ్లారు. భర్త వెంకటేష్, పిల్లలు బెడ్‌రూమ్‌లో నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో రమ్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్దిసేపటికి లేచి చూసిన వెంకటేశ్‌ దిగ్భ్రాంతికి లోనయ్యాడు. వెంటనే రమ్యను కిందకు దించి పరిశీలించగా అప్పటికే ఆమె మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని మెట్టుపాళయం ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం చేయించారు. అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు.


ప్రాణం తీసిన సోషల్‌ మీడియా
గత నెలలో పొరపాటున జరిగిన ప్రమాదాన్ని పట్టుకుని సోషల్‌ మీడియాలో నెటిజన్లు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. చిన్నారి తల్లి అయిన రమ్య లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. ఇవన్నీ చూస్తున్న రమ్య తట్టుకోలేకపోయింది. 'బిడ్డను చూసుకోవడం చేతకాదా?' అంటూ సోషల్‌ మీడియాలో, టీవీ ఛానళ్లు 'ఫెయిల్యూర్డ్ మదర్' అంటూ వార్తా ప్రసారాలతో ఆమె తీవ్ర మనోవేదనకు లోనయ్యింది. వీటన్నింటిని తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. అయితే సోషల్‌ మీడియా కారణంగా ఆ తల్లి ఆత్మహత్య చేసుకోగా.. 7 నెలల చిన్నారికి తల్లిని దూరం చేసింది. ఈ సంఘటన అందరినీ ఆవేదనకు గురి చేస్తోంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter