Mothers Day Tragedy: ప్రపంచవ్యాప్తంగా మాతృ దినోత్సవాన్ని ప్రజలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కొందరు తమ తల్లులతో చేసుకోగా.. మరికొందరు తల్లి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అయితే ఏపీలోని నెల్లూరులో మాత్రం మదర్స్‌ డే రోజే తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తల్లి రైలు పట్టాలు దాటుతుండగా ఆమె కుమారుడు కాపాడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో తల్లితోపాటు కుమారుడు కూడా రైలు ప్రమాదంలో మరణించాడు. ఈ సంఘటన స్థానికంగా విషాదం నింపింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Ankita Basappa: రైతు బిడ్డ సరికొత్త రికార్డు.. పదో తరగతిలో 625కు 625 మార్కులు


 


నెల్లూరు జిల్లా సైదాపురం మండలం చాగణం గ్రామానికి చెందిన బట్టా సుభాషిణి ప్రభుత్వ ఉద్యోగస్తురాలు. ఆమె ప్రస్తుతం ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో కావలిలో ఎన్నికల విధులు చేస్తున్నారు. విధుల కోసం ఆదివారం స్వగ్రామం నుంచి బయల్దేరి కావలి చేరుకుంది. కావలిలో రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. ఆమెను కాపాడేందుకు ఆమె కుమారుడు విజయ్‌ తీవ్ర ప్రయత్నాలు చేశాడు.

Also Read: YS Sharmila Tears: వైఎస్ జగన్‌ వ్యాఖ్యలతో కలత.. కన్నీళ్లు పెట్టుకున్న వైఎస్‌ షర్మిల


 


తల్లిని రైలు ఢీకొడుతున్న విషయాన్ని గ్రహించి వెంటనే తల్లి వద్దకు వెళ్లాడు. అయితే అప్పటికే రైలు వేగంతో ఉండడంతో తల్లితోపాటు కుమారుడిని కూడా రైలు ఢీకొట్టింది. పట్టాలపై తల్లీ కుమారుడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటనతో ఆ కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది విషయం తెలుకుని తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కానీ ఎన్నికల విధుల నేపథ్యంలో వారు రాలేకపోయారు.


తల్లీకుమారుడు ఎంతో ప్రేమగా ఉండేవారని బంధువులు చెబుతున్నారు. తల్లీకొడుకులు సుభాషిణి, విజయ్‌ ఎప్పుడూ ఆనందంగా ఉండేవారు. మాతృ దినోత్సవం నాడు కూడా విధులకు వెళ్లాల్సి ఉండడంతో విజయ్‌ తన తల్లి సుభాషిణిని దగ్గరుండి రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. తన ప్రాణం పణంగా పెట్టి తల్లిని కాపాడే ప్రయత్నంలో విజయ్‌ కూడా ప్రాణాలు కోల్పోవడం జీర్ణించుకోలేని విషయం. ఒకేరోజు తల్లీకుమారులు మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter