Ankita Basappa: ఒకప్పుడు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడమే కష్టమయ్యేది. కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఎన్ని మార్కులకు పరీక్షలు నిర్వహిస్తే పూర్తిస్థాయి మార్కులు పొందుతున్న కాలం వచ్చింది. అవి మార్కులా? లేక ఇంకేంటి అని అవాక్కయ్యే పరిస్థితులు వచ్చాయి. మొన్న ఏపీ పదో వార్షిక పరీక్ష ఫలితాల్లో ఓ విద్యార్థిని 600కు 599 మార్కులు వచ్చి సంచలనం రేపగా.. తాజాగా ఆమె రికార్డును ఓ బాలిక తిరగరాసింది. 625కు 625 మార్కులు సాధించి సంచలనం సృష్టించింది. ఆ రికార్డు సాధించిన బాలిక సాధారణ రైతు కుటుంబం కావడం విశేషం.
Also Read: Maharashtra: యూట్యూట్ నటుడు నిర్వాకం.. ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోకి దూసుకెళ్లడంతో కలకలం
మొన్న ఏపీలో విడుదలైన ఫలితాల్లో ఏలూరు జిల్లాకు చెందిన నాగసాయి మనస్వీ 600కు 599 మార్కులు సాధించిన విషయం తెలిసిందే. తాజాగా కర్ణాటకలో విడుదలైన పదో తరగతి వార్షిక ఫలితాల్లో ఓ అమ్మాయి ఏకంగా 625/625 మార్కులు సాధించి ఔరా అనిపించింది. బాగల్‌కోట్ జిల్లా వజ్జరమట్టి గ్రామానికి చెందిన అంకిత బసప్ప ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసింది. తాజాగా వెలువడిన ఫలితాల్లో మొత్తం 625 మార్కులు ఉంటే 625 మార్కులు సాధించి అందరినీ విస్మయానికి గురి చేసింది. పూర్తి మార్కులు పొంది రాష్ట్రంలోనే తొలి ర్యాంకర్‌గా ఆమె నిలిచింది. అత్యధిక స్కోర్ సాధించిన విద్యార్ధిగా అంకిత గుర్తింపు పొందింది.
Also Read: Light Beers: తాగుబోతుల పాలిట దేవుడయ్య నువ్వు.. లైట్ బీర్ల 'హీరో'కు ఘన సన్మానం
పూర్తి స్థాయి మార్కులు సాధించిన అంకిత బసప్ప ఓ సాధారణ రైతు బిడ్డ. వారి కుటుంబం వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. తండ్రి బసప్ప రైతు, తల్లి సాధారణ గృహిణి. వారు తమ కుమార్తెను ముధోల్ సమీపంలోని మొరార్జీ దేశాయ్ గురుకుల పాఠశాలలో చదివించారు. మొదటి నుంచి చదువులో ప్రతిభ కనబరుస్తున్న అంకిత అత్యధిక మార్కులు సాగిస్తుందని అందరూ నమ్మారు. కానీ పూర్తిస్థాయి మార్కులు సాధిస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు.
ఫలితాలు వెల్లడయిన అనంతరం స్వగ్రామంలో సంబరాలు మిన్నంటాయి. గ్రామస్తులు బాలిక ఇంటికి చేరుకుని అభినందించారు. ఈ సందర్భంగా అంకిత మాట్లాడుతూ.. తన భవిష్యత్ లక్ష్యాన్ని వివరించింది. ఇంజినీరింగ్ చదవాలని.. ఐఏఎస్ కావడమే తన తుది లక్ష్యమని ప్రకటించింది. కుటుంబం, తన ఉపాధ్యాయుల కృషితోనే ఈ ఫలితం సాధ్యమైందని పేర్కొంది. తన మార్కుల పట్ల కుటుంబం ఆనందం ఉండడం తనకు ఎంతో సంతోషమని తెలిపింది.
అత్యధిక మార్కులు సాధించి మొదటి ర్యాంకర్ అంకిత బసప్పను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అభినందించారు. కాగా పదో తరగతి పరీక్షలు మార్చి 25 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు జరిగాయి. దాదాపు 8.6 లక్షల మంది విద్యార్థులు రాశారు. వారిలో 6.31 లక్షల మంది ఉత్తీర్ణత సాధించడం విశేషం. కాగా ఈ ఫలితాల్లో మరికొందరు విద్యార్థులు కొంత అంకితకు దగ్గరగా ఫలితాలు సాధించారు. ఇద్దరు విద్యార్థులు 625 మార్కులకు ఒక్క మార్కు తక్కువ సాధించారు. చిన్మయి, సహానా అనే విద్యార్థినులు 624 మార్కులు సాధించి అంకిత రికార్డుకు దూరమయ్యారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter