New Twist in Naveen Murder Case: ఇద్దరు అబ్బాయిలు.. ఒక అమ్మాయి... ఇది సినిమా స్టోరీ కథ కాదు.. నిజమైన క్రైమ్ కథ. ప్రేమించిన అమ్మాయి తనకు దక్కలేదని స్నేహితుడినే అతి కిరాతకంగా హత్య చేశాడు . శరీరంలోని ప్రతి భాగాన్ని కట్ చేసి ఆ అమ్మాయికి వాట్సప్ చేశాడు. నువ్వు ముద్దు పెట్టిన పెదాలు ఇవే కదా.. నీ గుండె ఇదేనా. నీకు కావాల్సిన మెయిన్ భాగం ఇదేనా .. అంటూ... ఇలా శరీరంలోని అన్ని భాగాలు కోసేసి అమ్మాయికి వాట్సాప్ మెసేజ్ చేశాడు. లవర్​తో చనువుగా ఉంటున్నాడని ఒకే ఒక కారణంతో స్నేహితుడిని చంపేసిన సైకో కిల్లర కథ ఏంటో ఇప్పుడు చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. ఇద్దరు కాలేజీ స్టూడెంట్స్ ఒక అమ్మాయిని ఇష్టపడ్డారు. ఆ యువతి ఎవరిని ప్రేమించిందో తెలీదు. కానీ వీళ్లద్దరూ మాత్రం ఆమె కోసమే పట్టుపట్టారు. ఆ పిల్ల నాకు కావాలంటే నాకు కావాలని గొడవ పడేవారు. ఎలాగైనా ఆ అమ్మాయిని తానే దక్కించుకోవాలని అందులో ఒకడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు.... స్నేహితుడే అన్న విచక్షణ కూడా మరిచిపోయి అతన్ని దారుణంగా చంపేశాడు.. ఈ గుండె కదా నా లవర్ ను ప్రేమించింది, అని అతని గుండెను కత్తితో కోసి ప్రియురాలికి వాట్సప్ చేశాడు. హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్‌ మెట్ లో జరిగిన ఈ ఘటన ఉల్కిపడేలాచేస్తోంది..


నాగర్ కర్నూల్ జిల్లా చారగొండ మండలం సిరిసనగండ్లకి చెందిన నేనావత్ నవీన్ నల్గొండ జిల్లాలోని మహ్మత గాంధీ యూనవివర్సిటీలో ఇంజనీరింగ్ బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. అదే కాలేజీలో ముసారాంబాగ్ కు చెందిన హరిహర కృష్ణ చదువుతున్నాడు. . వీరిద్దరు గతంలో ఇంటర్ ఒకే కాలేజీలో చదువుకున్నప్పుడు నుంచి మంచి స్నేహితులు. మళ్లా మహ్మత గాంధీ యూనవివర్సిటీలో కలిసి చదువుకుంటున్నారు. ఇక్కడ అసలు సమస్య మొదలైంది. గతంలో దిల్ సుఖ్ నగర్ లోని ఒక ప్రైవేటు జూనియర్ కళాశాలలో హరికృష్ణ, నవీన్, ఓ యువతి క్లాస్ మేట్స్.. నవీన్ హరహర కృష్ణ ఇద్దరు ఈ అమ్మాయినే ప్రేమించారు. కానీ సదరు యువతి మాత్రం నవీన్ తో చనువుగా ఉండేది, అలా ఉండడాన్ని దీన్ని జీర్ణించుకోలేని నిందితుడు హరహర కృష్ణ .. నవీన్ హత్యకు కుట్ర పన్నాడు.


ఎలాగైనా నవీన్ ను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న హరికృష్ణ పక్కా ప్రణాళిక ప్రకారం ఈ నెల 17వ తేదీ గెట్ టు గెదర్ పార్టీ పేరుతో హైదరాబాద్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఓ చోటకు రావాల్సిందిగా పిలిచాడు. తన ఇంటర్ స్నేహితుడు హరిహరకృష్ణ ఫోన్ చేస్తే వెళ్తున్నానని నవీన్ తన స్నేహితులకు చెప్పి హైదరాబాద్ వచ్చాడు. ఆరోజు రాత్రి సమయంలో నవీన్ తన స్నేహితులకు ఫోన్ చేసి మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్రధాన గేటు వద్దకు బైక్ తీసుకొని రావాల్సిందిగా చెప్పాడు. అతను చెప్పినట్లు స్నేహితులు బైక్ తీసుకుని అక్కడికి వెళ్లి ఫోన్ చేయగా.. నవీన్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. నవీన్ స్నేహితుల్లో ఒకరు హరికృష్ణకు ఫోన్ చేశారు. తన వద్దకు వచ్చి తిరిగి వెళ్ళిపోయాడు అతడు బదులిచ్చాడు. అప్పటికే... నవీన్ ను హత్య చేసి గుట్టల ప్రాంతంలో పడేశాడు నిందితుడు. స్నేహితుల వద్దకు వెళ్లిన నవీన్ ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. పోలీసులను ఆశ్రయించారు. రెండు రోజుల తర్వాత హరికృష్ణ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని రావడంతో హరికృష్ణ పై అనుమానం రావడంతో ఆ విషయాన్ని పోలీసులకు తెలిపారు. తనపై ఉచ్చు బిగుస్తుండటంతో నవీన్ పోలీసుల ఎదుట లొంగిపోయి తన నేరాన్ని అంగీకరించాడు.


ఇంటర్ స్నేహితుడు నవీన్‌ను అతి దారుణంగా హత్య చేసిన హరి అతని శరీరంలోని ఒక్కొక్క భాగాన్ని బయటకు తీస్తూ కిరాతకంగా ప్రవర్తించి, అతన్ని హత్య చేసిన తర్వాత ఆ విషయాన్ని సదరు అమ్మాయికి ఫోన్ చేసి చెప్పాడు. అంతేకాదు అతని శరీరం నుంచి ఒక్కో భాగాన్ని వేరు చేసి ఆ ఫోటోలను ఆమెకు వాట్సాప్ చేశాడు, ఈ వేలే కదా నిన్ను తాకింది, ఇదిగో వేలు అంటూ నవీన్ వేలు కోసి ఆ ఫోటోను అమ్మాయికి పంపించాడు. ఆ తరువాత ఈ పెదాలే కదా నిన్ను తాకింది అంటూ పెదాలు కోసి ఆ ఫోటోను అమ్మాయికి పంపించాడు, ఆ అనంతరం ఈ గుండెనే కద నిన్ను తాకింది అంటూ నవీన్ గుండెను బయటకు తీసి ఆ ఫోటో సైతం పంపించాడు.


ఆ అనంతరం ఇదే కదా మెయిన్ పార్ట్ నీకు కావాల్సింది అంటూ నవీన్ మర్మాంగాన్ని కూడా కోసేశాడు. ఆ తర్వాత అతని తలను, మొండెంను వేరు చేసి దూరంగా పడేసి ఆ అనంతరం నవీన్‌ను ఏవిధంగా హత్య చేశాడో వివరిస్తూ అమ్మాయికి మెసేజ్ చేశాడు. అయితే ఆ ఫోటోలు చూసి, మెసేజులు చదివిన ఆ అమ్మాయి ఇదంతా జోక్ అనుకుందో, ఏమో గానీ అవునా ఓకే, వెరీ గుడ్ అంటూ రిప్లై ఇవ్వడం గమనార్హం. ఈ క్రమంలో నిందితుడికి అమ్మాయి సహకరించిందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: భర్తను వదిలేసి ప్రియుడితో సరసాలు.. శ్రద్దా వాకర్ తరహాలో చంపి పారేసిన తండ్రి!


Also Read: Anasuya Bharadwaj on Gays: ఫ్రెండ్స్, ఫామిలీలో 'గే'లు ఉన్నారు.. అనసూయ ఆసక్తికర కామెంట్స్!    



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook