Honour Killing in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఒక పరువు హత్యకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కర్నూలు జిల్లా పాణ్యం మండలం ఆలమూరులో ఒక తండ్రి కన్న కూతురిని దారుణంగా చంపి ముక్కలు చేసి అడవిలో పారేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లా పాణ్యం మండలం ఆలమూరు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తన కుమార్తె భర్త వద్దకు కాపురానికి వెళ్లకుండా వివాహేతర సంబంధం పెట్టుకొని తమ కుటుంబం పరువు తీస్తోందని కోపంతో దారుణంగా చంపేశాడు. వివరాల్లోకి వెళితే ఆలమూరు గ్రామానికి చెందిన దేవేందర్ రెడ్డి అనే వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
వారిలో పెద్ద కుమార్తె ప్రసన్నకు ప్రస్తుతం 21 సంవత్సరాలు. ఆమెకు రెండు ఏళ్ళ క్రితమే ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు ఇచ్చి వివాహం జరిపించారు. వారిద్దరూ హైదరాబాద్ లో నివాసం ఉండేవారు, అయితే ప్రసన్నకు పెళ్లికి ముందే మరో వ్యక్తితో ప్రేమ వ్యవహారం ఉండేది. తనకు పెళ్లి ఇష్టం లేదని తండ్రికి చెప్పినా వినిపించుకోకుండా వివాహం చేయడంతో పెళ్లయిన తర్వాత కూడా భర్తతో పాటు సదరు వ్యక్తితో కూడా వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఉండేది. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ నుంచి సొంత గ్రామానికి తిరిగి వచ్చిన ఆమె భర్త దగ్గరికి మళ్ళీ తిరిగి వెళ్ళలేదు. ఈ క్రమంలో తన పరువు పోయిందని భావించిన ప్రసన్న తండ్రి దేవేందర్ రెడ్డి కుమార్తెపై కోపం పెంచుకున్నాడు.
ఫిబ్రవరి 10వ తేదీన తన కుమార్తెను ఇంట్లోనే గొంతు నిలిపి చంపేశాడు. ప్రాణాలు కోల్పోయిన ప్రసన్న మృతదేహాన్ని కొందరి సహాయంతో కారులో నంద్యాల గిద్దలూరు మార్గంలో అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అక్కడ తన కుమార్తె మృతదేహాన్ని తలా మొండెం వేరు చేసి తల ఒకచోట మొండెం ఒకచోట పడేసి వెనక్కి వచ్చారు. అయితే ఈ మధ్యకాలంలో మనవరాలు తనకు ఫోన్ చేయడం లేదని ఆమెకు ఫోన్ చేయబోయిన తాత శివారెడ్డికి ఆమె ఫోన్ కలవక పోవడంతో అనుమానం వచ్చింది. ఈ క్రమంలో ప్రసన్న ఎక్కడికి వెళ్లిందని ఆమె తండ్రిని ఆరా తీస్తే చాలా సేపు తటపటాయించి చివరికి పరువు తీస్తోందని తానే చంపి అడవిలో పడేసానని చెప్పాడు.
దీంతో శివారెడ్డి పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు గురువారం నాడు దేవేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రసన్న మృతదేహాన్ని పడేసిన ప్రాంతానికి తీసుకెళ్లి గాలించారు. రోజంతా గాలించిన ఆమె శరీరానికి సంబంధించిన ఆనవాళ్లు దొరకలేదు, అయితే శుక్రవారం నాడు మరో సారి డాగ్ టీంతో తీసి వెళ్లి పరిశీలించగా ఆమె తల మొండెం రెండూ దొరికాయి. ప్రస్తుతానికి వాటిని పోస్టుమార్టం నిమిత్తం, ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీలైనంత త్వరలో ఈ కేసుకు సంబంధించి పోలీసులు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది.
Also Read: Viveka Murder Case: వివేకా హత్య కేసులో రెండవసారి విచారణకు అవినాష్ రెడ్డి, ఇవాళ అరెస్టు తప్పదా
Also Read: Avinash reddy on CBI: ముగిసిన సీబీఐ విచారణ, సీబీఐ తీరుపై అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook