Medchal Accident: వంటేరు ప్రతాప్ రెడ్డి కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం!
Medchal Road Accident: మేడ్చల్ జిల్లాలో కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. అయితే ఆ కారు ఒంటేరు ప్రతాప్ రెడ్డిదిగా తెలుస్తోంది.
Medchal Road Accident: మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని అత్వేల్లి నేషనల్ హైవే-44పై మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెలంగాణ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి వాహనం ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునన్నారు. మృతుడు మేడ్చల్ పట్టణానికి చెందిన గౌర్ల నర్సింహులు (58)గా గుర్తించారు. ప్రతాప్ రెడ్డి కారు బైక్ ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. సంఘటన జరిగిన ప్రదేశం నుండి ప్రతాప్ రెడ్డి కారును పోలీసులు తరలించినట్లు తెలుస్తోంది.
ఆర్టీసీ బస్సు బోల్తా--15 మందికి గాయాలు
ఈ నెల 12న టీఎస్ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. ఈ బస్సు హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తుండగా జాతీయ రహదారి-44పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. యాదగిరిగుట్ట డిపో బస్సు శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత వనపర్తి జిల్లాలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో మెుత్తం 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో నరసింహ(కేశంపేట), శ్రీకాంత్(హన్మకొండ), కృపానంద (హైదరాబాద్), జయన్న (బద్వేల్), షబ్బీర్ (కర్నూల్), షకీల(రాయచోటి), ఉపేందర్ (జనగామ), అర్జున(కర్నూలు), సుమలత (ఆళ్లగడ్డ), రఫీక్ (షాద్ నగర్)లు ఉన్నారు.
Also Read: Telangana: హైవేపై బోల్తాపడిన ఆర్టీసీ బస్సు.. 15 మంది గాయాలు, ముగ్గురికి సీరియస్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook