Woman Rape Case in Pune: పుణెలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్త ముందే 34 ఏళ్ల మహిళపై కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఈ సంఘటనను మొబైల్ చిత్రీకరించి.. పలుమార్లు బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. చివరికి బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరిలో ఈ ఘటన చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిందితుడు ఇంతియాజ్ హెచ్.షేక్ (47) బాధితురాలి భర్తకు వడ్డీ లేకుండా రూ.40 వేలు అప్పుగా ఇచ్చాడు. ఆ దంపతులు రుణం మొత్తాన్ని తిరిగి ఇవ్వలేకపోయారు. తన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఇంతియాజ్ వారిని దుర్భాషలాడడం.. బెదిరించడం చేశాడు. ఫిబ్రవరి నెలలో వారిని పుణేలోని హడప్సర్ ప్రభుత్వ కాలనీలోని ఎవరూ లేని ప్రదేశానికి దంపతులను పిలిపించాడు. మరోసారి అప్పు గురించి అడగ్గా.. తమ వద్ద ప్రస్తుతం డబ్బు లేదని త్వరలో తిరిగి చెల్లిస్తామని చెప్పారు. దీంతో ఇంతియాజ్ బాధితురాలి భర్తను కొరడాతో కొట్టి.. కత్తితో చంపుతానని బెదిరించాడు. అక్కడే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తన ఫోన్‌లో సంఘటనను చిత్రీకరించాడు. 


ఆ వీడియోను అడ్డంగా పెట్టుకుని పలుమార్లు బెదిరించి బాధితురాలిపై అఘాయిత్యం చేశాడు. వేధింపులు తాళలేక బాధితురాలు ఎదురుచెప్పింది. దీంతో అత్యాచారానికి పాల్పడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు నిందితుడు. ఆగడాలను భరించలేకపోయిన బాధితులు ధైర్యం తెచ్చుకుని.. హడప్సర్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు పోలీస్ ఇన్‌స్పెక్టర్ రవీంద్ర షెలాకే తెలిపారు. నిందితుడి కోసం గాలించి అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. కోర్టు ముందు హాజరుపరిచామని.. రెండు రోజుల రిమాండ్ విధించినట్లు చెప్పారు. తదుపరి విచారణలు కొనసాగుతోందన్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు.


ఈ సంఘటన నగరంలో సంచలనం సృష్టించింది. ఇంతియాజ్ ఇంకా ఎవరినైనా ఇతర బాధితులను ట్రాప్ చేసి.. ఇదే విధంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడా..? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. బాధితులు ఎవరైనా ఉంటే.. ధైర్యంగా తమకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.


Also Read: PM Kisan 14th Installment: గుడ్‌న్యూస్.. అకౌంట్‌లోకి డబ్బులు జమ.. మీ పేరు ఇలా చెక్ చేసుకోండి


Also Read: BRO Twitter Review: బ్రో ట్విట్టర్ రివ్యూ.. పబ్లిక్ టాక్ ఇదే.. పవన్ స్టామినాకు తగ్గట్లే..!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి