RRB Group D Exam Two Held for Cheating: ఇటీవల జరిగిన రైల్వే గ్రూప్ డీ పరీక్షలో ఓ అభ్యర్థి చీటింగ్‌కి యత్నించిన తీరు విస్తుగొలిపేలా ఉంది. తన స్నేహితుడికి బదులు పరీక్షకు హాజరైన ఆ అభ్యర్థి అడ్డంగా బుక్కయ్యాడు. బయోమెట్రిక్ సమయంలో అతని చేతి వేలికి అంటించిన చర్మం ఊడిపోవడంతో చీటింగ్ వ్యవహారం బయటపడింది. దీంతో ఆ ఇద్దరిపై కేసులు నమోదయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీహార్‌లోని ముంగర్ జిల్లాకు చెందిన మనీశ్ కుమార్, అతని స్నేహితుడు రాజ్యగురు గుప్తా కలిసి ఈ చీటింగ్‌కి స్కెచ్ వేశారు. మనీశ్ కుమార్‌ ఈ నెల 22న గుజరాత్ వడోదరాలోని లక్ష్మీపురా ప్రాంతంలో ఉన్న పరీక్షా కేంద్రంలో గ్రూప్ డీ పరీక్ష రాయాల్సి ఉంది. అయితే తనకు బదులు తన స్నేహితుడు గుప్తాతో పరీక్షరాయిస్తే రైల్వే జాబ్ వస్తుందని మనీశ్ కుమార్ భావించాడు. గుప్తా బాగా చదువుతాడు కాబట్టి అతనితో పరీక్ష రాయించాలనుకున్నాడు.


ఇందుకు గుప్తా కూడా ఒప్పుకోవడంతో మనీశ్ ఓ స్కెచ్ వేశాడు. పరీక్ష జరిగే ముందురోజు తన ఎడమ చేతి బొటనవేలిని బాగా వేడిగా ఉన్న పాత్రపై పెట్టాడు. దీంతో పై చర్మం ఊడి వచ్చినట్లయింది. ఆ చర్మాన్ని కత్తిరించి గుప్తా ఎడమ చేతి బొటనవేలికి అంటించాడు. పరీక్షా కేంద్రంలో బయోమెట్రిక్ ఉంటుంది కాబట్టి తనకు బదులు గుప్తా హాజరైనా ఎవరూ గుర్తించకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ పనిచేశాడు.


కానీ తీరా పరీక్షా కేంద్రంలో గుప్తా అడ్డంగా దొరికిపోయాడు. బయోమెట్రిక్ సమయంలో గుప్తా తీరుపై ఎగ్జామ్ సూపర్ వైజర్‌కి అనుమానం కలిగింది. ఎడమ చేతిని అతను ప్యాంట్ పాకెట్‌లో దాచుకునే ప్రయత్నం చేయడంతో ఎక్కడో తేడా కొట్టింది. వెంటనే శానిటైజర్ ఇచ్చి చేతులకు అప్లై చేసుకోవాలని సూచించాడు. గుప్తా తన చేతులకు శానిటైజర్ అప్లై చేయడంతో ఆ చర్మం ఊడి వచ్చింది. దీంతో విస్తుపోయిన సూపర్ వైజర్ గుప్తా చీటింగ్‌కి యత్నించినట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో గుప్తాను అదుపులోకి తీసుకున్నారు. అతనితో ఈ పని చేయించిన మనీశ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపై ఐపీసీ సెక్షన్లు 465 (ఫోర్జరీ), 419 (చీటింగ్), 120 B (నేరపూరిత కుట్ర)ల కింద కేసులు నమోదు చేశారు.


Also Read: Horoscope Today August 26th : నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారి బలహీన స్థితిని చూసి ప్రత్యర్థులు రెచ్చిపోయే ఛాన్స్..


Also Read: Telangana Rain Updates: తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్... ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన...   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook