Woman Raped In ICU: ఘోరం.. ఐసీయూలో ఉన్న మహిళపై అత్యాచారం.. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి..
Rajasthan:మంగళవారం రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోని ఐసీయూలో చేరిన 24 ఏళ్ల మహిళపై నర్సింగ్ అసిస్టెంట్ అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన తీవ్ర దుమారంగా మారింది.
Alwar Nursing Assistant Raped Patient In ICU: సభ్య సమాజం తలదించుకునే ఘటన రాజస్థాన్ లో జరిగింది. మహిళల భద్రతకు ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన కొందరు మనిషిరూపంలో ఉన్న మృగాళ్లు మాత్రం మారడం లేదు. కొందరు నీచులు.. పసి పిల్లల నుంచి పండు ముసలి వరకు ఏ ఒక్కరిని వదలడం లేదు.
Read More: Anjali: రెడ్ డ్రెస్ లో తెగ అలరిస్తున్న అంజలి…50వ సినిమా ప్రమోషన్స్ కోసం విన్నుతంగా!!
ఇంట్లో, బస్టాండ్, పోలీస్ స్టేషన్ ఎక్కడ కూడా అమ్మాయిల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. కుక్కలు, ఆవులు, గేదెలపైకూడా అత్యాచారాలకు పాల్పడిన ఘటనలు వార్తలలో నిలిచాయి. తాజాగా, ఐసీయూలో ఉన్న మహిళపై ఒక కామాంధుడు దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తీవ్ర దుమారంగా మారింది. అతగాడిని నడిబజారులో ఊరితీయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
పూర్తి వివరాలు..
రాజస్థాన్ లోని అల్వార్ జిల్లా లో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. శివాజీ పార్క్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) రాజ్‌పాల్ సింగ్ మాట్లాడుతూ... 24 ఏళ్ల మహిళ ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ కారణంగా ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. ఐసియులో చికిత్స పొందుతోంది. నిందితుడు చిరాగ్ యాదవ్ ఆమెకు .. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. తెల్లవారుజామున 4 గంటలకు ఆమెపై దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం.
ఈ క్రమంలో.. ఆమె భర్త మొబైల్‌కి కాల్ చేయడంతో మహిళ స్పృహలోకి వచ్చిందని సింగ్ చెప్పారు. దీంతో ఆమె తన కుటుంబ సభ్యులకు జరిగిన బాధను వివరించింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన స్థానికంగా దుమారంగా మారింది.
Read More: Raw Onion: ప్రతిరోజూ పచ్చిఉల్లిపాయ తింటే ఈ 10 రోగాలకు దూరంగా ఉండొచ్చు..
దీనిపై కఠిన చర్యలు తీసుకొవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టుచేసినట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులు ఆస్పత్రిలోని సీసీ కెమెరాను పరిశీలించారు. నిందితుడు కర్టన్ కప్పుతున్నట్లు చేసి, దారుణానికి ఒడిగట్టిన ఘటన సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook