Anjali: రెడ్ డ్రెస్ లో తెగ అలరిస్తున్న అంజలి…50వ సినిమా ప్రమోషన్స్ కోసం విన్నుతంగా!!

Anjali Geethanjali Malli Vachindi: అచ్చమైన తెలుగమ్మాయిల కనిపిస్తూ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న హీరోయిన్ అంజలి. ఈ హీరోయిన్ ప్రస్తుతం స్టైలిష్ డ్రెస్సులో షేర్ చేసిన ఫోటోలు అందరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి.
 

  • Feb 27, 2024, 20:02 PM IST
1 /6

షాపింగ్ మాల్ అనే తమిళ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ అంజలి. ఆ సినిమాలో ‘నా ప్రాణం నువ్వైపోతే..’పాత ప్రేక్షకులకు ఎంత దగ్గర అయిందో.. అంజలి కూడా తన అందం.. నటనతో ప్రేక్షకులకు అంతకన్నా ఎక్కువ చేరువైంది.

2 /6

ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి లో జన్మించిన అంజలి ఫోటో అనే తెలుగు సినిమాతో తెరంగేట్రం చేసింది. అయితే తన మొదటి రెండు చిత్రాలు ఫోటో, లవ్ లెటర్ జ్యూస్ అసలు ఎప్పుడు విడుదలయ్యాయి అనే విషయం కూడా తెలియనంత ఫ్లాప్ అయ్యాయి.

3 /6

ఆ తరువాత తన మక్కాం చెన్నైకి మార్చి తమిళంలో మంచి విజయం అందుకుంది. ఎన్నో తమిళ సినిమాలలో నటించిన అంజలి తెలుగులో మహేష్ బాబు, వెంకటేష్ తో చేసిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో సూపర్ హిట్ అందుకుంది.

4 /6

ఆ చిత్రం మంచి విజయం సాధించిన దగ్గర నుంచి అంజలీకి తమిళం తో పాటు తెలుగులో కూడా ఆఫర్లు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా తాను ప్రాధాన్య పాత్రలో కనిపించిన గీతాంజలి సినిమా మంచి విజయం సాధించి అంజలి కి మరింత పేరు తెచ్చిపెట్టింది.

5 /6

ప్రస్తుతం ఈ సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ గీతాంజలి మళ్లీ వచ్చింది అని చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉంది ఈ హీరోయిన్. ఈ సినిమా అంజలి 50వ సినిమా కావడం విశేషం.

6 /6

తాజాగా ఈ చిత్రం ప్రమోషన్స్ కోసం అంజలి రెడ్ డ్రెస్ లో షేర్ చేసిన ఫోటోలు మన అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి.