Rajkot Fire Accident: గేమింగ్ జోన్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 24 మంది మృతి
Rajkot Fire Accident Latest Updates: గుజరాత్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాజ్‌కోట్‌లోని టీఆర్‌పీ గేమింగ్ జోన్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 24 మంది మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Rajkot Fire Accident Latest Updates: గుజరాత్ రాజ్‌కోట్‌లోని టీఆర్‌పీ గేమింగ్ జోన్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది విద్యార్థులు, చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఫైర్ ఇంజిన్ సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంకా మంటల్లో కొంతమంది చిక్కుకున్నట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు ఇంకా వెల్లడికాలేదు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉనట్లు తెలుస్తుండగా.. సహాయ చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అగ్నిప్రమాదానికి సంబంధించి కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని రాజ్‌కోట్ పోలీస్ కమిషనర్ తెలిపారు. నగరంలోని అన్ని గేమింగ్ జోన్లను మూసివేయాలని సందేశం జారీ చేసినట్లు తెలిపారు.
Also Read: Google maps: కొంప ముంచిన గూగుల్ తల్లి.. హైదరాబాద్ టూరిస్టులకు ఊహించని షాక్..
ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. "రాజ్‌కోట్‌లో జరిగిన అగ్నిప్రమాదం గురించి తెలిసి నేను చాలా బాధపడ్డాను. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. స్థానిక యంత్రాంగం అన్ని విధాలుగా సహాయాన్ని అందిస్తోంది." అని ప్రధాని ట్వీట్ చేశారు. అగ్నిప్రమాద ఘటనపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ స్పందించారు. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. రాజ్‌కోట్‌లోని గేమ్ జోన్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో తక్షణ రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్ల కోసం అధికారులకు సూచనలు జారీ చేసినట్లు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
మృతదేహాలు బాగా కాలిపోవడంతో గుర్తించడం కష్టతరంగా మారింది. ఇప్పటికే గేమ్ జోన్ యజమానిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. యువరాజ్ సింగ్ సోలంకి, మన్విజయ్ సింగ్ సోలంకి గేమ్ జోన్ యజమానులు కాగా.. ప్రకాష్ జైన్, రాహుల్ రాథోడ్ గేమ్ జోన్ మేనేజర్‌లుగా పని చేస్తున్నారు. కాగా.. ఈ ప్రమాదం నుంచి 10 మందికి పైగా సురక్షితంగా బయటపడ్డారు. గేమ్ జోన్ పూర్తిగా మంటల్లో కాలిపోయింది. పోలీస్ కమిషనర్ రాజీవ్ భార్గవ, కలెక్టర్ ఆనంద్ పటేల్ దగ్గర ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కలవాడ్ రోడ్డులోని టీఆర్‌పీ గేమ్ జోన్‌లో ప్రమాదం చోటు చేసుకోగా.. 5 కిలోమీటర్ల దూరం వరకు పొగలు కమ్ముకున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter