Rape Incident: తెలంగాణలో మరో గ్యాంగ్ రేప్ ఘటన..మత్తు మందు ఇచ్చి దారుణం..!
Rape Incident: ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా..మహిళలపై దాడులు ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక చోట దారుణ ఘటన వెలుగు చూస్తున్నాయి. తాజాగా తెలంగాణలో మరో అఘాయిత్యం చోటుచేసుకుంది.
Rape Incident: తెలంగాణలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వివాహిత(24)పై సామూహిక అత్యాచారం జరిగింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అనుమానాస్పద స్థితిలో మహిళ తిరుగుతుండటంతో పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. దీంతో అసలు విషయం బయటపడింది. వివాహితకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పలువురు అనుమానితులను గుర్తించినట్లు తెలుస్తోంది.
వారిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం అందుతోంది. 24 ఏళ్ల వివాహితను ఆటోలో జహీరాబాద్ తీసుకొచ్చి డిడిగి గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రాంతంలో దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. బాధితురాలు సికింద్రాబాద్‌కు చెందిన మహిళగా గుర్తించారు. ఆటో ఎక్కిన వివాహితకు మత్తు మందు ఇచ్చారా..లేక జహీరాబాద్ ప్రాంతానికి తీసుకొచ్చాక మద్యం తాగించారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కూకట్‌పల్లి కేపీహెచ్ కాలనీ నుంచి జహీరాబాద్‌కు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
అత్యాచారం చేసిన తర్వాత దుండగులు ఆమె అక్కడే వదిలేసి వెళ్లారు. కొన్నాళ్లుగా బాధితురాలు భర్తకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. దీనిపై అన్ని కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు.ఇటీవల దేశవ్యాప్తంగా దారుణ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. నిర్భయ తరహా చట్టాలు తీసుకొచ్చినా..అత్యాచారాలు ఆగడం లేదు. వీటిని ఆపేందుకు కఠిన చట్టాలను తీసుకురావాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. నిందితులను తక్షణమే శిక్షిస్తే..ఇలాంటి ఘటన జరగవని అంటున్నారు.
మరోవైపు దారుణ ఘటనలపై దేశవ్యాప్తంగా మహిళా సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. ప్రభుత్వాలు..కఠిన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాయి. అప్పుడే వీటికి అడ్డుకట్ట వేయొచ్చని అంటున్నారు.
Also read:GVL Narasimha Rao: ఎన్టీఆర్‌ను బీజేపీ ఓన్ చేసుకుంటోందా..జీవీఎల్ ఆసక్తికర ట్వీట్..!
Also read:IND vs AUS: ఉప్పల్ టీ20 మ్యాచ్‌కు వర్షం ముప్పు..వాతావరణ శాఖ లెటెస్ట్ న్యూస్..!
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook