IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు టీ20ల సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. దీంతో ఇవాళ హైదరాబాద్ ఉప్పల్ వేదికగా చివరి మ్యాచ్ జరగనుంది. ఈమ్యాచ్‌లోనే గెలిచిన జట్టుకే సిరీస్ దక్కనుంది. ఈనేపథ్యంలో చివరి మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. ఐతే నాగ్‌పూర్ తరహానే హైదరాబాద్‌లోనూ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. సాయంత్రం 5.30 గంటలకు తర్వాత వర్షం పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఆ సమయంలో వర్షం కురిసే అవకాశం 18 శాతంగా ఉందని..ఆ తర్వాత కూడా 14 నుంచి 17 శాతం ఉందని చెబుతున్నారు. హైదరాబాద్‌లో పగటి ఉష్ణోగ్రత 29 డిగ్రీలు, రాత్రి సమయంలో 22 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. రోజంతా ఆకాశంలో మేఘావృతమై ఉంటాయని..అందుకే పగటి పూట 24 శాతం, రాత్రి సమయంలో 22 శాతం వర్షం పడే అవకాశం ఉందని తెలుస్తోంది. తేమ పగటి పూట 75 శాతం, రాత్రి సమయంలో 86 శాతానికి పెరగనుంది.
అందుకే టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు..తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఉప్పల్‌లోనూ అలాంటి పరిస్థితి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఉప్పల్‌లో సాయంత్రం 6.30 గంటలకు టాస్ పడనుంది. 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. నాగ్ పూర్ తరహాలో వర్షం ప్రభావం చూపిస్తే మ్యాచ్‌లను కుదించే అవకాశం ఉంది. రెండో మ్యాచ్‌లో 8 ఓవర్లకు మ్యాచ్ నిర్వహించారు.
ఇందులో భారత్ జట్టు విజయం సాధించింది. దీంతో సిరీస్‌ను సమం చేసింది. ఈమ్యాచ్‌లో రోహిత్ శర్మ అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. 20 బంతుల్లో 46 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇందులో నాలుగు ఫోర్లు, సిక్సర్లు ఉన్నాయి. వెటరన్ ప్లేయర్ దినేష్ కార్తీక్ చివర్లో ఫినిషింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. రెండు బంతుల్లో పది పరుగులు చేశారు. ఇందులో సిక్సర్, ఫోర్ ఉంది.
భారత జట్టు..
రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేషన్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, చాహల్/అశ్విన్..
Also read:GVL Narasimha Rao: ఎన్టీఆర్‌ను బీజేపీ ఓన్ చేసుకుంటోందా..జీవీఎల్ ఆసక్తికర ట్వీట్..!
Also read:IND vs AUS: ఉప్పల్ మైదానానికి వెళ్లే అభిమానులకు కీలక సూచన ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook