Tamil Director Manikandan: సినిమా దర్శకుడు పడిన కష్టాన్ని దొంగలు గుర్తించారు. ఇంట్లో దొంగతనం చేసిన వస్తువుల్లో అతడికి సంబంధించిన అవార్డులు, మెడల్స్‌ కూడా ఉన్నాయి. అయితే అవి అతడికి కష్టానికి సంబంధించిన గుర్తింపు కావడంతో వాటిని తిరిగి ఇచ్చారు. దర్శకుడి ఇంటికి వచ్చి వాటిని ఆ ఇంట్లో పెట్టి వెళ్లారు. ఈ సంఘటన తమిళనాడులోని మధురై జిల్లాలో చోటుచేసుకుంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: IndiGo Screw Sandwich: శాండ్‌విచ్‌లో ఇనుప బోల్ట్‌, స్క్రూ.. ఇలా ఉంటే ఎలా తినాలిరా అయ్యా!


తమిళ సినీ పరిశ్రమకు చెందిన దర్శకుడు మణికందన్‌. సినిమాల కోసం ఆయన తమిళనాడు రాజధాని చెన్నైలో నివసిస్తున్నాడు. 'కాకా ముట్టై' వంటి విజయవంతమైన సినిమాలను తెరకెక్కించాడు. అతడి స్వగ్రామం మాత్రం మధురై జిల్లా ఉసిలంపట్టి సమీపంలోని విలాంపట్టి ఎలిల్‌ నగర్‌. గ్రామంలోని సొంత ఇంటిలో ఫిబ్రవరి 8వ తేదీన దొంగలు పడ్డారు. ఇంట్లో ఉన్న 5 సవర్ల బంగారం, రూ.లక్ష నగదుతోపాటు బీరువాలోని ఉన్న వస్తువులన్నీ తీసుకెళ్లారు. ఇంట్లో దొంగలు పడడంతో మణికందన్‌ డ్రైవర్‌ గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వాళ్లు వచ్చి ఇంటిని పరిశీలించి కేసు నమోదు చేసుకుని వెళ్లారు. అయితే అనూహ్యంగా గురువారం తెల్లవారుజామున లేచి చూడగా ఇంటి తలుపుకు ఓ ప్లాస్టిక్‌ కవర్‌ వేలాడదీసి ఉంది.

Also Read: Valentines Day: ఆంటీకి చెప్పు వద్దని.. నేను నిన్నే చేసుకుంటానని బాయ్‌ఫ్రెండ్‌ ఫన్నీ రిప్లయ్‌


ప్లాస్టిక్‌ కవర్‌ తెరచి చూడగా అందులో ఓ వెండి పతకం కనిపించింది. దాంతోపాటు అందులో ఓ లేఖ ఉంచారు. ఆ వెండి పతకం దర్శకుడు మణికందన్‌ తీసిన సినిమాకు వచ్చింది. ఆ లేఖలో 'అయ్యా మమ్మల్ని క్షమించండి. మీ కష్టం మీకే' అని రాసి ఉంది. అయితే ఆ కవర్‌ దొంగలు పెట్టి వెళ్లారని గుర్తించారు. దర్శకుడు పడిన కష్టాన్ని గుర్తించిన దొంగలు వాటిని తిరిగివ్వడాన్ని పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దర్శకుడు కూడా దొంగల మంచి మనసును చూసి విస్మయం వ్యక్తం చేశారు. దొంగలు తిరిగి పంపిన మెడల్‌ను లేఖను మణికందన్‌ సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు.


మణికందన్‌ తీసిన కాక మట్టై సినిమా ఉత్తమ బాలల చిత్రంగా 62వ జాతీయ సినిమా అవార్డును గెలుచుకున్నారు. 2015లో కిరుమి అనే క్రైమ్‌ థిల్లర్‌ సినిమా చేశాడు. 2016 కుత్రమె తందననై , ఆనందన్‌ కట్టలై సినిమాలు తీశాడు. 2021లో తీసిన కదైసి వివసాయి 69వ జాతీయ చలనచిత్ర అవార్డు లభించింది. విజయవంతమైన సినిమాలు తీసి అవార్డులు గెలిచిన దర్శకుడిని శ్రమను వృథా చేయొద్దనే ఉద్దేశంతో దొంగలు ఆ అవార్డులు తిరిగి ఇవ్వడం సినీ పరిశ్రమతోపాటు సోషల్‌ మీడియాలో ఆసక్తికర చర్చ జరిగింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook