IndiGo Screw Sandwich: శాండ్‌విచ్‌లో ఇనుప బోల్ట్‌, స్క్రూ.. ఇలా ఉంటే ఎలా తినాలిరా అయ్యా!

Sandwich Screw and Bolt: మీరు తినే ఆహారం చూసి తినండి. హోటల్‌, రెస్టారెంట్ల నుంచి పార్సిల్‌ తెచ్చుకుని తింటుంటే పరిశీలించి తినాలి. లేకపోతే వింత వింత వస్తువులు వచ్చే అవకాశం ఉంది. ఇలా ఓ ప్రయాణికురాలికి శాండ్‌విచ్‌లో ఇనుప బోల్ట్‌, స్క్రూ వచ్చింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 14, 2024, 05:31 PM IST
IndiGo Screw Sandwich: శాండ్‌విచ్‌లో ఇనుప బోల్ట్‌, స్క్రూ.. ఇలా ఉంటే ఎలా తినాలిరా అయ్యా!

IndiGo Airlines: ఆహార తయారీలో శుభ్రత పాటించకపోవడంతో తినే సమయంలో తినకూడని పదార్థాలు వస్తున్నాయి. హోటల్‌ నిర్వాహకులు చేస్తున్న పొరపాట్లతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా విమానంలో ఓ ప్రయాణికురాలికి వింత అనుభవం ఎదురైంది. విమాన సంస్థ అందించిన శాండ్‌వించ్‌లో ఇనుప బోల్ట్‌ కనిపించింది. తింటున్న సమయంలో నోటిలో ఇనుప బోల్ట్‌ రావడంతో భయపడింది. వెంటనే విమానయాన సంస్థకు ఫిర్యాదు చేయగా.. ఒక్కసారి విమానం దిగాక తమకు సంబంధం లేదని ఆ అధికారులు చెప్పడంతో ఆమెకు ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే సామాజిక మాధ్యమాల్లో విషయాన్ని చెప్పింది. 

Also Read: Valentines Day: ఆంటీకి చెప్పు వద్దని.. నేను నిన్నే చేసుకుంటానని బాయ్‌ఫ్రెండ్‌ ఫన్నీ రిప్లయ్‌

శాండ్‌వించ్‌ అంటే ఏమిటి? రెండు బ్రెడ్‌ ముక్కలు వాటి మధ్య కీర, టమాట, చీజ్‌ ఇక మిగతా పదార్థాలు కలిపి తయారు చేస్తారు. ఇండిగో విమానంలో అందించిన శాండ్‌విచ్‌లో మాత్రం అదనంగా ఇనుప బోల్ట్‌ కూడా పెట్టారు.ఫిబ్రవరి 1వ తేదీన జ్యోతి రౌతలా అనే ప్రయాణికురాలు బెంగళూరు నుంచి చెన్నైకు ఇండిగో విమానం 6ఈ-904లో ప్రయాణం చేసింది. ప్రయాణ సమయంలో ఇండిగో సంస్థ జ్యూస్‌, శాండ్‌వించ్‌ అందించింది. అయితే విమానం దిగాక ఎయిర్‌పోర్టులో తినేందుకు నోట్లో పెట్టుకోగా పళ్లకు ఏదో గట్టిగా తగిలింది. వేరే శబ్ధం కూడా వచ్చింది. వెంటనే తీసి చూడగా ఇనుప బోల్ట్‌ వచ్చింది. ఇది చూసి అవాక్కైన ప్రయాణికులు వెంటనే ఇండిగో ప్రతినిధులను కలిసి ఫిర్యాదు చేసింది.

Also Read: Delhi Rikshawala: రిక్షావాలా అని తక్కువ చూడొద్దు డూడ్.. ఇంగ్లీష్‌ వింటే నోరెళ్లబెడతారు

దీనికి ఆ సిబ్బంది ఇచ్చిన సమాధానం మరింత విస్మయానికి గురి చేసింది. 'మీరు విమానం దిగాక మాకు సంబంధం లేదు. విమానంలో ఉన్నప్పుడు ఫిర్యాదు చేసి ఉంటే మేం చర్యలు తీసుకోనేవాళ్లం. మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం' అని చెప్పారు. దీంతో ఆ మహిళ చేసేందేమీ లేక సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ఇక సోషల్‌ మీడియాలో కూడా ఇండిగో విమాన సంస్థ స్పందించింది. 'సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్త మాకు తెలిసిందే. కానీ ఆ సమస్య ప్రయాణికురాలు విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో జరగలేదు. మా విమానంలో ఆహార పదార్థాలు నాణ్యతతో అత్యంత పరిశుభ్రంగా వండుతాం. అలాంటి పరిస్థితులు వాటిల్లే ఆస్కారం లేదు. ప్రయాణికురాలికి కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం' అని ప్రకటించింది.

ఈ సంఘటనపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విమానం దిగిపోతే స్పందించరా? అని నిలదీస్తున్నారు. 'ఆమె విమానంలో ఉన్నప్పుడే ఫిర్యాదు చేయాలంటే కుదరదు. కదా?' మరికొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 'బాధ్యత వహించాల్సింది పోయి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు' అని ఇండిగో తీరుపై మండిపడుతున్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయమై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయాలని ఆ మహిళకు సూచిస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News