Spanish Tourist Gangrape in Jharkhand: జార్ఖండ్ లోని దుమ్కాలో స్పెయిన్ దేశానికి చెందిన మహిళపై జరిగిన దారుణ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. మహిళ తన భర్తతో కలిసి హన్స్ దిహా ప్రాంతంలో రాత్రి పూట టెంట్ వేసుకుని రిలాక్స్ అవుతున్నారు. ఇంతలో కొందరు కామాంధులు వారిపైనదాడులకు తెగబడ్డారు. అంతేకాకుండా.. మహిళపై అత్యంత దారుణంగా దాడిచేసి సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో రాత్రంత దంపతులు షాకింగ్ లోనే ఉండిపోయారు. ఉదయాన్నే పోలీసులకు ఫిర్యాదు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Balakrishna : మరో తెలుగు అమ్మాయికి బాలకృష్ణ ఛాన్స్…పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్న బ్యూటీ


ఘటనపై పోలీసులు, దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసలు వెల్లువెత్తాయి. నిందితులను పట్టుకుని కఠినంగా పనిష్మెంట్ చేయాలని కూడా అనేక డిమాండ్ లు వచ్చాయి. ఈ క్రమంలో నిందితుల కోసం జల్లెడ పట్టారు. ఘటన జరిగిన కొన్ని గంటలలోనే నిందితులను కనిపెట్టారు. ఏడుగురు గ్యాంగ్ కలిసి అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. వీరిలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. వారి కోసం ప్రత్యేకంగా పోలీసులు వెతుకుతున్నారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు  మిన్నంటాయి.


మన దేశంలోని పర్యాటక ప్రదేశాలు చూడటానికి వచ్చిన వారికి ఇలాంటి అన్యాయం జరగడమేంటని అనేక మంది ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను పట్టుకుని కఠినంగా పనిష్మెంట్ చేయాలని కూడా పోలీసులను డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. ఘటన జరిగాక స్పెయిన్ జంట షాకింగ్ లో ఉండిపోయారు. తొలుత సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలని మహిళ భావించిందని ఆమె భర్త ఆవేదనతో పేర్కొన్నాడు. ఈ క్రమంలో జార్ఖంల్ పోలీసులు ఘటనను సీరియస్ గా తీసుకుని  నిందితులను పట్టుకున్నారు. మరికొందరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


Read More: Acidity Home remedies: ఆహారం తిన్నవెంటనే అసిడిటీ సమస్యా? ఈ 5 హోంరెమిడీస్‌తో సమస్యకు చెక్ పెట్టండి..


బాధితురాలికి కౌన్సిలింగ్ ఇప్పించారు. అదే విధంగా స్పెయిన్ బాధితురాలికి  10 లక్షల పరిహరం ఇచ్చినట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది. అత్యాచారం బాధితురాలి భర్త  మాట్లాడుతూ.. పోలీసులు  వేగవంతమైన దర్యాప్తు చేపట్టారని తెలిపారు.  ఈ ఘటనపై జార్ఖండ్ మంత్రి బన్నా గుప్తా మాట్లాడుతూ..  నిందితులపై కఠిన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook