Acidity Home remedies: ఆహారం తిన్నవెంటనే అసిడిటీ సమస్యా? ఈ 5 హోంరెమిడీస్‌తో సమస్యకు చెక్ పెట్టండి..

Home remedies for Acidity: ఈ కాలంలో యాసిడిటీ ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య. ఈ యాసిడిటీ ప్రధానంగా వేయించిన, మసాలాలు అధికంగా తీసుకోవడం లేదా పుల్లని పదార్థాలు తినడం వల్ల కొంతమందిలో ఈ సమస్య వస్తుంది

Written by - Renuka Godugu | Last Updated : Mar 4, 2024, 01:03 PM IST
Acidity Home remedies: ఆహారం తిన్నవెంటనే అసిడిటీ సమస్యా? ఈ 5 హోంరెమిడీస్‌తో సమస్యకు చెక్ పెట్టండి..

Home remedies for Acidity: ఈ కాలంలో యాసిడిటీ ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య. ఈ యాసిడిటీ ప్రధానంగా వేయించిన, మసాలాలు అధికంగా తీసుకోవడం లేదా పుల్లని పదార్థాలు తినడం వల్ల కొంతమందిలో ఈ సమస్య వస్తుంది. దీనివల్ల తేన్పులు, కడుపులో ఉబ్బసం వస్తుంది. ఈ యాసిడిటీ సమస్యను తగ్గించుకోవడానికి మందులు ఉన్నాయి. కానీ, కొన్ని హోం రెమిడీలతో కూడా యాసిడిటీకి చెక్ పెట్టొచ్చు.

అరటిపండు..
మీకు యాసిడిటీ సమస్య ఉంటే భోజనం చేసిన వెంటనే ఓ అరటిపండు తినండి. ఇది కూడా యాసిడిటీ నుంచి మీకు మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. అరటిపండు గ్యాస్, అజీర్తి సమస్యకు చెక్ పెడుతుంది. యాసిడిటీ సమస్య ఉన్నవారు ప్రతిరోజూ అరటిపండు తినాలి. కొన్ని రోజుల్లోనే మంచి ప్రభావం కనిపిస్తుంది.

అల్లం నీరు..
మీకు ఎప్పుడైనా కడుపులో అజీర్తి చేస్తే కాస్త అల్లం దంచి కొద్దిగా వాటర్ వేసి వడకట్టుకుని తాగండి. ఇది ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో ఇలా అల్లం నీటిని తీసుకోవడం వల్ల యాసిడిటీ సమస్యతో బాధపడేవారికి మంచి ఉపశమనం లభిస్తుంది. అల్లం దంచి కొన్ని నీళ్లలో వేసి ఉడికించుకోవాలి.  చల్లారిన తర్వాత అరచెంచా తేనె, నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఈ నీటిని తాగితే కడుపులో గ్యాస్ సమస్యకు మంచి ఉపశమనం కలుగుతుంది.

సోంపునీరు..
సోంపు జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. మన పెద్దలకు కూడా ఆహారం తిన్న తర్వాత నాలుగు సోంపు గింజలను నమిలేవారు. కడుపులో యాసిడ్ ను చల్లార్చడంలో సోంపు కీలకపాత్ర పోషిస్తుంది.  ఇందులో ఫైబర్ ఉండటం వల్ల యాసిడిటీని తగ్గిస్తుంది. సోంపు నీటిని తాగడం లేదా నేరుగా తినవచ్చు కూడా. ఉదయం ఖాళీ కడుపుతో కూడా సోంపు నీటిని తాగవచ్చు. దీనివల్ల కడుపు సమస్యలు తగ్గిపోతాయి.

ఇదీ చదవండి: : మీ ఇంటి కిచెన్లోనే డయాబెటిస్‌కు మందు.. ఇలా తీసుకుంటే చక్కెర స్థాయిలు పెరగవు..  

గోరువెచ్చని నీరు..
ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటితో మీరోజును ప్రారంభించండి. యాసిడిటీ సమస్య మీ దరిదాపుల్లోకి కూడా రాదు. గ్యాస్ సమస్య ఉన్నవారు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగాలి. దీంతో మీకు మంచి ఉపశమనం కలుగుతుంది.

ఇదీ చదవండి:  ఈ కిచెన్ వస్తువుతో జుట్టు విపరీతంగా పెరుగుతుంది.. మీరే నమ్మలేరు..

మజ్జిగ..
మజ్జిగ శరీరానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. వేసవికాలంలో మజ్జిగ వేడినుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే తిన్నవెంటనే మజ్జిగ కూడా తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్ సమస్య రాదు. కడుపులో యాసిడిటీ పెరగకుండా మజ్జిగ సహాయపడుతుంది. మజ్జిగ కడుపు సమస్యలకు చెక్ పెడుతుంది. ఇది మన ఇళ్లలో అందుబాటులో ఉండే ఆహారమే కాబట్టి భోజనం చేసిన వెంటనే మజ్జిగ తాగండి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News