Harassment On Women: పోకిరీలు, ఆకతాయిల వేధింపులతో మహిళలు ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. రోడ్డుపై వెళ్తుంటే చాలు ఆకతాయిలు వేధింపులకు పాల్పడుతున్నారు. ఎన్ని చట్టాలు తెచ్చినా వారి తీరు మారడం లేదు. ఈ క్రమంలోనే తల్లీకూతుళ్లను వేధిస్తుంటే బాలుడు ధైర్యసాహసాలు ప్రదర్శించి అడ్డగించాడు. వారికి ఎదురుతిరిగి దాడి చేశాడు. అయితే దుండగులు తుపాకీ కాల్పులు జరపడంతో ఆ బాలుడు గాయపడ్డాడు. ప్రస్తుతం బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన హర్యానాలో చోటుచేసుకుంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Modi: నీ మొగుడితో గొడవ జరిగితే మాత్రం మోదీ పేరు చెప్పొద్దు.. మహిళలతో ప్రధాని జోకులు


హర్యానాలోని పల్వాల్‌లో ఈనెల 22వ తేదీన తన తల్లి, సోదరితో కలిసి ఓ బాలుడు బయటకు వచ్చారు. పని ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో రోడ్డుపై ముగ్గురు ఆకతాయిలు ఎదురువచ్చారు. ముగ్గురు యువకులు అక్కను కామెంట్లు చేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధించసాగారు. అంతటితో ఆగకుండా తల్లితో కూడా దురుసు ప్రవర్తన చేశారు. దీంతో పదో తరగతి చదువుతున్న లోకేశ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆకతాయిలను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. వారిని దూరం నెట్టేస్తూ తీవ్రంగా శ్రమించాడు. తల్లిని, అక్కను కాపాడుకునేందుకు లోకేశ్‌ పోరాడాడు. తమ వినోదానికి అడ్డు వచ్చిన లోకేశ్‌పై జులాయిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే దుండగుల్లో ఒకరు తుపాకీ తీసుకుని లోక్‌శ్‌పై కాల్పులు జరిపాడు.

Als Read: Leopard Killed: ఇంట్లోకి దూరిన పులి.. కర్కశత్వంతో బూట్లతో తన్ని చంపేసిన అధికారులు


తుపాకీ తూటాలకు లోకేశ్‌ కిందపడిపోయాడు. ఈ ఘటనతో అక్కడి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. కాల్పులు జరిపిన అనంతరం దుండగులు పరారయ్యారు. వెంటనే స్థానికుల సహాయంతో తల్లీ, అక్క కలిసి లోకేశ్‌ను ఆస్పత్రిలో చేర్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆస్పత్రికి వెళ్లి లోకేశ్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అయితే అదృష్టవశాత్తు తుపాకీ గుళ్లు లోకేశ్‌ చేతికి తగిలాయి. చేతికి తీవ్ర గాయం కాగా వైద్యులు చికిత్స అందించారు. లోకేశ్‌ ప్రాణానికి ప్రమాదం లేదని వైద్యులు చెప్పారు.


కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరారైన దుండగులను గాలిస్తున్నారు. ఈ సందర్భంగా రోడ్డుపై ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీను పరిశీలిస్తున్నారు. విచారణలో లోకేశ్‌పై కాల్పులు జరిపిన దుండగుడి వివరాలు లభించాయి. బాదరాకు చెందిన కోకన్‌గా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ప్రధానంగా అతడి కోసం గాలిస్తున్నారు. కాగా ఈ సంఘటనతో పల్వాల్‌లో మహిళలు భయభ్రాంతులకు గురయ్యారు. పట్టపగలు ఇలాంటి సంఘటన ఎదురుకావడంతో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక మహిళలు డిమాండ్‌ చేస్తున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి