Wife Murder Attempt On Husband in Khammam: కొందరు భార్యభర్తలు చిన్న చిన్న విషయాలకు గొడవలు పడుతుంటారు. పెళ్లైన తర్వాత ఇద్దరు పెరిగిన పరిస్థితులు, చుట్టుపక్కల వాతావరణం భిన్నంగా ఉంటాయి. దీంతో ఇద్దరి మధ్య కొన్ని విషయాలలో తరచుగా మనస్పర్థలు చోటు చేసుకుంటాయి. వీటిని మాట్లాడుకుని పరిష్కరించుకొవాలి. కానీ కొందరు మాత్రం దీన్ని హైలేట్ చేసుకుంటారు. ప్రతిచిన్న విషయాలకు గొడవలకు దిగుతుంటారు. ఇంట్లో నాలుగు గొడల మధ్య ఉండాల్సిన విషయాలను బజారున పాడేసుకుంటారు. దీంతో చిన్న గొడవ కాస్త, పెరిగి పెద్దదవుతుంది. కొందరు భార్యలకు వంట వండరాదని, కర్రీలో ఉప్పు సరిగ్గాలేదని వేధిస్తుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Viral Video: కజరారే పాటకు క్లాసులో లేడీ టీచర్ హాట్ స్టెప్పులు... వీడియో చూస్తే తట్టుకోలేరు..


అందంగా లేదని, కట్నం తేలేదని సూటిపోటీమాటలతో సాధిస్తుంటారు. ఇక.. మహిళలు కూడా తామేం తక్కువ కాదన్నట్లు..  భర్త బంగారం కొనివ్వడంలేదని, తక్కువ సంపాదిస్తున్నాడంటూ.. మాటలతో వేధిస్తుంటారు. ఇలాంటి ఘటనల్లో కొందరు గొడవలు పడుతుంటే, మరికొన్నిసార్లు విడాకుల వరకు వెళ్తాయి. ఇంకొన్నిసార్లు హత్యలకు కూడా దారితీస్తుంటాయి. అచ్చం ఇలాంటి కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.


పూర్తి వివరాలు..


తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భార్య తన భర్త పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర విషాదంగా మారింది. యాకుబ్ పాషా, సమీనాలు ఇద్దరు భార్యభర్తలు. వీరు ఖమ్మంలో ఉంటున్నారు.  ఈ క్రమంలో.. యాకుబ్ పాషా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నాడు. సంపాదన అంతగా లేకపోవడంతో ఎలాగోలా ఫ్యామిలీని నెట్టుకొస్తున్నాడు. ఇదిలా ఉండగా.. సమీనా తన భర్తనుఎప్పుడు ఏదో ఒకటి కొనివ్వమంటూ వేధించేది.


Read More: Snake Venom Rave Party: పాముల విషంతో రేవ్ పార్టీ.. బిగ్ బాస్ OTT 2 విన్నర్ అరెస్టు..


అసలే అరకోర సంపాదన.. ఎలా నెట్టుకురావాలో అని యాకుబ్ ఆలోచిస్తుండేవాడు. ఈ క్రమంలో తనకు బంగారు చెవిదిద్దులు కొనివ్వాలని భర్తను అడిగింది. కొన్నిరోజులుగా ఇదే విషయంమీద ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నయి. ఇక కోపం పట్టలేక.. సమీనా.. భర్తపై పెయిటింగ్ కెమికల్ పోసింది. అంతటితో ఆగకుండా నిప్పుపెట్టింది. మంటలను తాళలేక అతను ఇంటి నుంచి బాధతో అరుస్తు బైటకు వచ్చాడు. వెంటనే చుట్టుపక్కల వారు పోలీసులకు, అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. వెంటనే బాధితుడిని ఆస్పత్రికి తరలించారు ప్రస్తుతం బాధితుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


 


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook