Women Brutally Murder Her Son On Extramarital Affair In Nagar kurnool: సమాజంలో తల్లికి ఉన్నత స్థానం ఉందని చెబుతుంటారు. మనుషులే కాదు.. మూగ జీవాలు సైతం తల్లులు తమ పిల్లల కోసం ఎంతో తాపత్రయ పడుతుంటాయి. ఎవరైన తమపిల్లల జోలికి వస్తే అస్సలు వదిలిపెట్టవు. తమ కన్న ఎంత పెద్ద జంతువులతో నైన పోరాటానికి సిద్దంగా ఉంటాయి. ఇక మనుషులలో తల్లిప్రేమ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తల్లిప్రేమను చూపించే ఎన్నో ఘటనలు తరచుగా వార్తలలో నిలుస్తుంటాయి. ఇదిలా ఉండగా.. కొందరు తల్లులు మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటారు. అచ్చంపశువుల మాదిరిగా ప్రవర్తిస్తుంటారు. తమ సుఖంకోసం కన్నపేగును సైతం చంపడానికి వెనుకాడరు. వివాహేతర సంబంధాలు పెట్టుకుని అడ్డుగా ఉన్న తమ పిల్లల పట్ల పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. అచ్చం ఇలాంటి కోవకు చెందిన ఘటన నాగర్ కర్నూల్ లో చోటు చేసుకుంది. ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర కలకలంగా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Viral Video: కజరారే పాటకు క్లాసులో లేడీ టీచర్ హాట్ స్టెప్పులు... వీడియో చూస్తే తట్టుకోలేరు..


ఈ లోకంలో తల్లికిచ్చినంత గౌరవం మరెవ్వరికీ ఇవ్వరు. ఎందుకంటే నవ మాసాలు మనల్ని మోసి జీవితాంతం మనని ఎంతో ప్రేమతో పెంచేది తల్లి,అలాంటి తల్లే  కన్న కొడుకుని చంపేసింది అంటే నమ్ముతారా,ఇప్పుడు అలాంటి ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బిజినపల్లి మండలం అల్లిపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. అల్లిపూర్ గ్రామానికి చెందిన డేగ లక్ష్మి, రవీందర్ లకు ముగ్గురు సంతానం. ముగ్గురులో మొదటి ఇద్దరు పిల్లలు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. మూడవ పిల్లాడైనా హరికృష్ణ వయసు 12 సం,తల్లిదండ్రుల వద్ద ఉంటున్నాడు.ఈ క్రమంలో.. డేగ లక్ష్మి కి అదే గ్రామానికి చెందిన నక్క కురుమయ్యతో వివాహేతర సంబంధం పెట్టుకుంది.  


పలుమార్లు ఇదేవిషయంలో భార్యభర్తలకు మధ్య గొడవలుజరిగాయి. గ్రామ పెద్దలు అనేక సార్లు సర్ది చెప్పిచెప్పారు.వీరి మాటలను పాటిస్తున్నట్లే నటించి లక్ష్మి  సీక్రెట్ గా పాడుపనులు మాత్రం ఆపేది కాదు. ఈ క్రమంలో.. నిన్న రాత్రి భర్త వేరే గ్రామానికి పనిపై వెళ్లడంతో ప్రియుడుతో కలిసి ఇంట్లో ఉన్న లక్ష్మి తన అక్రమ సంబంధానికి దుకాణం తెరిచింది.ఇక..వీరిని ఆమెచిన్నకొడుకు అసభ్యంగా ఉన్నప్పుడు చూశాడు. దీంతో కోపంతో.. అడ్డుగా ఉన్నాడనే నేపంతో తన చిన్న కుమారుడైన హరికృష్ణను తల్లి  ఇనుప గొట్టంతో తలపై కొట్టింది.  అలాగే తలను గోడకేసి గట్టిగా కొట్టడంతో బాగా రక్తస్రావమైన కొడుకు నేలకొరిగాడు. తనపై అనుమానం రావద్దని నేపంతో నేలకూలిన హరికృష్ణను దుప్పటి కప్పి ఇంటి ముందున్న నీటి సంపులో పడేసింది.


Read More: Arvind Kejriwal: కర్మ ఎవరిని వదిలిపెట్టదు.. కేజ్రీవాల్ అరెస్టుపై ప్రణబ్ కుమార్తె ఘాటు వ్యాఖ్యలు..



మరుసటి రోజు ఉదయం తనకేమీ ఎరుగన్నట్టుగా ఏడుస్తూ బంధువుల వద్దకు వెళ్లి నా కొడుకు నీటి సంపులో పడి చనిపోయినాడు అని నమ్మించే ప్రయత్నం చేసింది.. బంధువులు కలిసి హరికృష్ణ ని వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అంతలోపే చనిపోయినట్టు డాక్టర్లు వెల్లడించారు.  అనంతరం లక్ష్మీ భర్త రవీందర్, బందువు శేఖరు కలిసి భార్యపై అనుమానంతో బిజినేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కన్నతల్లి లక్ష్మి తన కుమారుడిని హతమార్చినట్లుగా నిర్ధారణ అయినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన మాత్రం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter