Qatar Papa: గర్భవతిని చేసి వదిలేశాడు.. పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన కత్తర్ పాప
Tiktok Qatar Papa Alias Shalini: టిక్ టాక్ స్టార్ కత్తర్ పాప పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. తనను ఓ యువకుడు గర్భవతిని చేసి మోసగించాడంటూ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
Tiktok Qatar Papa Alias Shalini: టిక్ టాక్ యాప్‌తో సోషల్ మీడియాలో భారీ పాపులారీటి సంపాదికుంది కత్తర్ పాప అలియాస్ షాలిని. ఈమె పదునైన మాటలను.. బూతులను చూసేందుకు చాలా మంది నెటిజన్లు ఎగబడి చూస్తుంటారు. టిక్‌టాక్ యాప్ బ్యాన్ అయినా.. కత్తర్ పాపకు మాత్రం క్రేజ్ తగ్గలేదు. యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్ చేస్తూ.. హల్‌చల్ చేస్తుంటుంది. అంతేకాదు ప్రైవేట్ సాంగ్స్ చేస్తూ తన ఫాలోవర్స్‌కు టచ్‌లోనే ఉంది కత్తర్ పాప. అయితే తాజాగా తనను ఓ యువకుడు మోసం చేశాడంటూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. పూర్తి వివరాలు ఇలా..
హైదరాబాద్‌లో తనను ఓ యువకుడు ప్రేమించి మోసం చేశాడని ఎస్ఆర్ నగర్ పోలీసులకు షాలిని ఫిర్యాదు చేసింది. తనను గర్భవతిని చేసి మోసగించాడని ఆరోపించింది. ఆమె ఫిర్యాదు మేరకు ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. యువకుడిపై 376 రేప్ కేసు, 420 చీటింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. కత్తర్ పాపను వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 6 నెలలుగా షాలినితో రోహిత్ పఠాన్ ఖాన్ అనే యువకుడు సహజీవనం చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
నరసాపురానికి చెందిన షాలినికి 22 వయసులో ఓ వ్యక్తి (35)తో వివాహం జరిగింది. అయితే భర్త చెడు వ్యసనాలకు బానిస కావడంతో.. తన మూడేళ్ల బాబును తల్లిదండ్రుల వద్ద ఉంచి.. బతుకుదెరువు కోసం కత్తర్‌కు వెళ్లింది. అక్కడ ఓ ఇంట్లో పనిమనిషిగా వెళ్లి.. కొడుకు కోసం డబ్బులు దాచుకోవాలని వెళ్లింది. అక్కడి నుంచి భర్తకు డబ్బులు పంపిస్తుండగా.. అతను మోసం చేశాడు. అక్కడే టిక్‌టాక్‌లో వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అయింది. మళ్లీ ఇండియాకు వచ్చి.. భర్తకు విడాకులు ఇచ్చింది.
ఆ తరువాత రోహిత్ పఠాన్ అలియాస్ మున్నాతో పరిచయం అయింది. అతను తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. అప్పుడప్పుడు కారు డ్రైవింగ్ కూడా చేస్తాడు. అతనితో కలిసి హైదరాబాద్‌లోనే సహజీవనం చేస్తోంది. అయితే తాజాగా రోహిత్ పఠాన్ తనను మోసం చేశాడంటూ కత్తర్ పాప పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: IPL 2023: క్రికెట్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది
Also Read: Interest Free Loan: ఈ రాష్ట్ర రైతులకు గుడ్‌న్యూస్.. రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook