Tragedy Love: ఇద్దరిది ఒకటే గ్రామం. చిన్నప్పటి నుంచే పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఒకే ఊరు కావడంతో తరచూ నిత్యం కలుసుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారు. పెళ్లి వయసు రావడంతో వారిలో ఆందోళన మొదలైంది. ఎందుకంటే వారిద్దరూ సామాజిక వర్గాలు వేరు. తమ వివాహానికి పెద్దలు అంగీకరించరని భావించి వారిద్దరూ ప్రాణాలు బలి తీసుకున్నారు. ఈ సంఘటన తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Lok Sabha Polls: ఐదుగురి ప్రాణం తీసిన 'ఓటు'.. వడదెబ్బతో రాలిన పండుటాకులు


సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) మండలం తుమ్మల పెన్ పహాడ్ గ్రామానికి చెందిన గుండగాని సంజయ్ గౌడ్‌ (26) వ్యవసాయ పనులు చేస్తూనే వాటర్‌ ప్యూరిఫయిర్‌ మెకానిక్‌గా పని చేస్తుండేవాడు. ఇదే గ్రామానికి చెందిన చల్లగుండ నాగజ్యోతి (24) నర్సింగ్‌ పూర్తి చేసింది. సూర్యాపేట పట్టణంలో ప్రైవేటు ఆస్పత్రిలో నర్స్‌గా పని చేస్తోంది. ఒకే గ్రామం కావడంతో వీరి మధ్య పరిచయమైంది. నాలుగేళ్లుగా వీరిద్దరూ గాఢంగా ప్రేమించుకుంటున్నారు. గ్రామంలో ఎవరికీ తెలియనట్టుగా ఉంటున్న వీరిద్దరూ సూర్యాపేటలో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు.

Also Read: Weight Loss Surgery: ప్రాణం తీసిన 'అధిక బరువు శస్త్ర చికిత్స'.. వయసు 26 ఏళ్లు బరువు 150 కిలోలు


ఇటీవల వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని కుటుంబ పెద్దలకు చెప్పారు. అయితే కులాలు వేరు కావడంతో ఇద్దరి కుటుంబసభ్యులు పెళ్లికి అంగీకరించలేదు. పెళ్లి చేసుకుంటామని ఎంత చెప్పినా కుటుంబీకులు వినిపించుకోలేదు. పెద్దలను బుజ్జగించి ఒప్పించే ప్రయత్నం చేసినా విఫలం కావడంతో సంజయ్‌, నాగజ్యోతి మనో వేదనకు గురయ్యారు. తమ పెళ్లి కాదని ఆందోళన చెందిన వారిద్దరూ కొన్నాళ్లుగా మనస్తాపంతో ఉంటున్నారు. కలిసి బతకలేమని.. కనీసం కలిసి చనిపోదామని నిర్ణయించుకున్నారు.


ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున గ్రామం శివారుకు చేరుకున్న సంజయ్‌, నాగజ్యోతి పురుగుల నివారణ మందు సేవించారు. తీవ్ర అస్వస్థతకు గురయి అక్కడికక్కడే మృతి చెందారు. ఇది గమనించిన గ్రామస్తులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న కుటుంబీకులు దిగ్భ్రాంతికి గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిద్దరి మృతదేహాలను సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. పెళ్లికి నిరాకరించడంతో వీరిద్దరూ అఘాయిత్యానికి పాల్పడడంతో గ్రామంలో తీవ్ర విషాదం ఏర్పడింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter