Tragedy Love Story: ఒక యువతి ఇద్దరు ప్రేమికులు. ఇద్దరిలో ఎవరినో తేల్చుకోవాలని గొడవకు దిగగా ఆ ఇద్దరు యువకులను ఆ యువతి నిరాకరించింది. మీ ఇద్దరిని ప్రేమించడం లేదని తేల్చి చెప్పింది. దీంతో ఆ యువకులు రగిలిపోయారు. తమ ఇద్దరికి దక్కని ఆ యువతిని అత్యంత దారుణంగా కడతేర్చారు. అనంతరం ఆమెను చంపిన చోటే వారిద్దరూ గొడవపడ్డారు. ఈ ఘర్షణలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. తెల్లారి మిగిలిన ఒక్క యువకుడు ఈ దారుణాలన్నిటికి కారణం తమ యూనివర్సిటీ డీన్‌ అని ఆరోపిస్తూ లేఖ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇలా ఒక ప్రేమకు ముగ్గురు బలయ్యారు. చివరికి మూడు కుటుంబాల్లో తీరని విషాదం నిండింది. ఈ విషాద సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Parliament: ఒక్కసారి 'అధ్యక్షా' అనని ఎంపీలు.. వీళ్లు ఎంపీలుగా ఎన్నికై ఏం ప్రయోజనం?


గుంటూరులోని ఓ ప్రైవేటు విశ్వవిద్యాలయంలో వంశీ సాయికృష్ణ (20) అనే ఇంజినీరింగ్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో చ‌నిపోయాడు. ఈ సంఘటనపై తాడేపల్లి పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా వివరాలు ఆరా తీయగా విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. యువకుడి మరణం మరో ఇద్దరి హత్యకు కారణంగా నిలిచిందని తెలుసుకుని నిర్ఘాంతపోయారు. మొత్తం విచారణ చేపట్టగా అసలు నిజాలు బయటకు వచ్చాయి.

Also Read: Farmers Protest: మళ్లీ కదం తొక్కుతున్న రైతులు.. ఢిల్లీలో ఎక్కడిక్కడ నిర్బంధం, సరిహద్దులు బంద్‌?


అదే కళాశాలలో చదువుతున్న యువతిని వంశీ సాయికృష్ణతోపాటు బయటి కళాశాలకు చెందిన మరో యువకుడు ప్రేమించాడు. ఇద్ద‌రూ ఒకే అమ్మాయిని ప్రేమించడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఎవరో ఒకరిని తేల్చుకోవాలని చెబుతూ ఆ యువతిని బయటకు తీసుకెళ్లి నిలదీశారు. తమ ఇద్దరిలో ఒకరినే ప్రేమించాలని సూచించారు. వీరి ముగ్గురు తీవ్ర వాగ్వాదం జరిగింది. యువతి చివరకు మీరిద్దరూ వద్దని నిరాకరించింది. వారిద్దరినీ ప్రేమించలేనని స్పష్టంగా చెప్పేసింది. ఇంతటితో ఈ గొడవ సమసిపోతుందని యువతి భావించింది.


కానీ తమను నిరాకరించడంపై ఆ ఇద్దరు యువకులు తట్టుకోలేకపోయారు. తమలో ఒకరిని కూడా ప్రేమించకుండా నిరాకరించడంతో ఆ యువతిని అక్కడికక్కడే అతి కిరాతకంగా హత్య చేశారు. ఆ అమ్మాయిని చంపేసి ముక్క‌లు ముక్కలుగా దేహాన్ని క‌ట్‌ చేసి సూట్‌కేసులో భద్రపర్చారు. అనంతరం ఆ సూట్‌కేసును యువతి రూమ్మేట్‌కు ఇచ్చారు. ఆమె తర్వాత వస్తుంది రూమ్‌లో ఇది ఉంచు అని సూట్‌కేసు ఇచ్చారు. అనంతరం ఆ ఇద్ద‌రు తీవ్రంగా పోట్లాకున్నారు. పరస్పరం దాడి చేసుకోగా ఓ యువ‌కుడు తీవ్రంగా గాయపడి చ‌నిపోయాడు.


అనంతరం వంశీ సాయికృష్ణ యథావిధిగా వసతిగృహానికి వచ్చాడు. ఏం జరగనట్టు అందరితో కలిసి ఉన్నాడు. అయితే హాస్టల్‌ వెనుక మృతదేహం లభించడంతో కంగారుపడిన సాయి వంశీకృష్ణ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటనలు అన్నింటికి యూనివ‌ర్సిటీ డీన్ కార‌ణ‌మంటూ లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఒక ప్రేమ ముగ్గురు మరణాలకు దారితీసింది. ఈ సంఘటనలతో మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఈ సంఘటనలకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. త్వరలోనే తాడేపల్లి పోలీసులు వాస్తవ విషయాలను వెల్లడించే అవకాశం ఉంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook