CAA in India: సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్. స్థూలంగా చెప్పాలంటే సీఏఏ. దేశంలో వివాదాన్ని రేపిన ఈ చట్టం మరోసారి చర్చనీయాంశమౌతోంది. ఈ వివాదాస్పద చట్టాన్ని ఏడు రోజుల్లో దేశంలో అమలు చేస్తామంటూ ప్రకటించి సంచలనం రేపారు కేంద్ర మంత్రి శాంతనూ ఠాకూర్.
పౌరసత్వ సవరణ చట్టాన్ని వారం రోజుల్లో దేశవ్యాప్తంగా అమలు చేస్తామని కేంద్ర మంత్రి శాంతనూ ఠాకూర్ ప్రకటించారు. పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లా కాక్‌ద్వీప్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేవలం పశ్చిమ బెంగాల్ మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా వారం రోజుల్లో సీఏఏ అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. 1971 తరువాత ఇండియాకు వచ్చిన వారు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడీలు ఉన్నవాళ్లంతాగ దేశ పౌరులేనని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెబుతున్నారని శాంతనూ ఠాకూర్ మండిపడ్డారు. మతువా కులానికి చెందినవాళ్లు బీజేపీకు మద్దతిస్తున్నారనే కారణంతో వేలాది మందికి ఓటర్ ఐడీలు తిరస్కరించారని ఆరోపించారు.
పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎప్పటికీ పశ్చిమ బెంగాల్లో అమలుకానివ్వమని మమతా బెనర్జీ చాలాసార్లు స్పష్టం చేశారు. అందుకే సీఏఏపై ఇదే రాష్ట్రంలో బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. గత ఏడాది నవంబర్‌లో కోల్‌కతాలో జరిగిన ఓ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం ఇవే వ్యాఖ్యలు చేశారు. సీఏఏను అమలు చేసి తీరతామని, ఎవరూ ఆపలేరని అమిత్ షా చెప్పారు. బుజ్జగింపు రాజకీయాలు, సరిహద్దు చొరబాట్లు, అవినీతి, రాజకీయ హింసతో రాష్ట్రాన్ని నాశనం చేశారన్నారు.
తాజాగా కేంద్ర మంత్రి శాంతనూ ఠాకూర్ చేసిన వ్యాఖ్యల్ని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఖండించింది. కేవలం లోక్‌సభ ఎన్నికల్లో లబ్ది పొందేందుకే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తోందని విమర్శించారు. ఎవరెన్ని చెప్పినా రాష్ట్రంలో సీఏఏ అమలు కాదని స్పష్టం చేసింది.
Also read: AP Speaker: ఎమ్మెల్యేలతో స్పీకర్ విచారణ నేడే, అనర్హత వేటు పడేనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook