Rath Yatra Accident: రథయాత్రలో తీవ్ర విషాదం.. విద్యుత్ షాక్‌తో ఏడుగురు మృతి
Ulta Rath Yatra In Tripura: త్రిపురలో ఘోర ప్రమాదం జరిగింది. ఉల్టా రథయాత్ర సందర్భంగా విద్యుత్ షాక్ తగిలి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ, త్రిపుర సీఎం మాణిక్ సాహా సంతాపం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు ఇలా..
Ulta Rath Yatra In Tripura: త్రిపురలో జగన్నాథుని ఉల్టా రథయాత్ర ఉత్సవం సందర్భంగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హైటెన్షన్ వైరు తగిలి రథానికి మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. 18 మందికి గాయాలు అయ్యాయి. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. ఉనకోటి జిల్లాలోని కుమార్‌ఘాట్‌లో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఉల్టా రథయాత్ర ఉత్సవం సందర్భంగా సాయంత్రం 4.30 గంటల సమయంలో రథాన్ని బయటకు తీస్తుండగా.. ఆకస్మాత్తుగా పైన ఉన్న హైటెన్షన్ వైర్లకు తాకింది.
దీంతో రథానికి మంటలు అంటుకోవడంతోపాటు విద్యుత్ షాక్ తగిలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కకడిక్కడే మరణించారు. మృతులను సుస్మితా వైష్ (30), సీమా పాల్ (33), రూపక్ దాస్ (40), సుమా బిస్వాస్ (28), రుహాన్ దాస్ (9), సహన్ మలాకర్ (9)గా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. క్షతగాత్రులను ఆసుపత్రుల్లో చేర్పించారు. గాయపడిన వారిలో ఏడుగురి పరిస్థితి విషయమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఇనుప రథాన్ని లాగుతుండగా ఘటన చోటు చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటన ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు అందజేస్తామని చెప్పారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. స్థానిక యంత్రాంగం బాధితులకు అన్ని విధాలా సహాయాన్ని అందిస్తోందని పీఎంవో ట్వీట్ చేసింది.
త్రిపుర సీఎం మాణిక్ సాహా మాట్లాడుతూ.. కుమార్‌ఘాట్ వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో విద్యుత్ ఘాతం కారణంగా పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం తనను బాధించిందని తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి చెప్పారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న త్రిపుర ఇంధన శాఖ మంత్రి విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉండగా.. అక్కడి నుంచే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై సంతాపం వ్యక్తం చేయడంతో పాటు ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ నిర్లక్ష్యంగా ఉందా అని విచారణ జరపాలని సూచించారు.
Also Read: గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రాథమిక కీ విడుదల.. అభ్యంతరాల స్వీకరణకు జూలై 05 వరకు గడువు..
Also Read: Singer Sai Chand: తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన ప్రముఖ సింగర్ కన్నుమూత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి