Sheezan Khan and his Secret Girlfriend Deleted Chat Retrieved: టీవీ నటి తునీషా శర్మ డిసెంబర్ 24న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తునీషా తన సూపర్ హిట్ సీరియల్ షో 'అలీ బాబా దస్తాన్ ఇ కాబూల్' సెట్స్‌లో  ఆమె సూసైడ్ చేసుకుంది. అయితే ఆ తర్వాత నటి తునీషా శర్మ తల్లి తన కుమార్తె తన మాజీ ప్రియుడు షీజన్ ఖాన్ వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని విధాలుగా విచారణ చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదే సమయంలో, సంఘటన జరిగిన రోజునే షీజన్ తన రహస్య ప్రియురాలితో చేసిన చాటింగ్‌ను ఇప్పుడు పోలీసులు తిరిగి రిట్రీవ్ చేశారు. తునీషా మృతి కేసులో పోలీసులు ఉన్న ప్రతి కోణాన్ని పరిశీలిస్తున్నారు మరియు ఈ క్రమంలోనే ఈలోగా, షీజన్ రహస్య ప్రియురాలితో చేసిన చాట్ కూడా తిరిగి రిట్రీవ్ చేశారు. పోలీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు షీజన్ రహస్య ప్రియురాలి ఫోన్‌ను మహారాష్ట్రలోని వాలివ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


షీజన్ రహస్య ప్రియురాలు ఇద్దరి చాట్‌ను తొలగించిందని, అది తిరిగి రిట్రీవ్ చేశారని అంటున్నారు. ఇక అదే సమయంలో షీజన్  రహస్య ప్రియురాలి వాంగ్మూలాన్ని కూడా పోలీసులు నమోదు చేశారు. అంతేకాక  షీజన్ ఇద్దరి చాట్‌ను కూడా తొలగించాడని, అందులో కొంత భాగాన్ని తిరిగి రిట్రీవ్ చేశామని అధికారులు పేర్కొన్నారు. తునీషా మరణానంతరం షీజన్ రహస్య ప్రియురాలితో గంటసేపు చాట్ చేశాడని, ఆ తర్వాత దానిని డిలీట్ చేశాడని వలీవ్ పోలీసులు చెబుతున్నారు.


రహస్య ప్రియురాలితో పాటు షీజన్ చాలా మంది అమ్మాయిలతో మాట్లాడేవాడని పోలీసులు చెబుతున్నారు. ఇక షీజన్ ఖాన్ మేకప్ రూమ్‌లో తునీషా శర్మ ఉరివేసుకుని చనిపోయిన క్రమంలో షీజన్ మీద అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి. షీజన్ స్వయంగా తునీషాని ఆసుపత్రికి తీసుకెళ్లాడు, కానీ అప్పటికే తునీషా మరణించింది. అదే సమయంలో, దీని తరువాత, తునీషా తల్లి షీజన్ ఆమె ఆత్మహత్యకు ప్రేరేపించాడని ఆరోపించింది. ఈ క్రమంలోనే డిసెంబర్ 25న పోలీసులు షీజన్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు.అతని రిమాండ్ ముగిసిన తర్వాత, షీజన్‌ను జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. 


Also Read: Prabhas Broke into Tears: షోలో కన్నీటి పర్యంతం అయిన ప్రభాస్, బాలకృష్ణ.. హగ్ చేసుకుని మరీ!


Also Read: Chandrababu -Jr NTR: ఎన్టీఆర్ తో భేటీ కానున్న బాబు.. ఎన్నికలే టార్గెట్ గా కొత్త ప్లాన్?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook