Prabhas Broke into Tears: షోలో కన్నీటి పర్యంతం అయిన ప్రభాస్, బాలకృష్ణ.. హగ్ చేసుకుని మరీ!

Balakrishna and Prabhas Broke into Tears: నందమూరి బాలకృష్ణ హోస్టుగా అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షో ప్రసారమవుతుండగా అందులో ప్రభాస్ పాల్గొన్నారు, అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 6, 2023, 05:09 PM IST
Prabhas Broke into Tears: షోలో కన్నీటి పర్యంతం అయిన ప్రభాస్, బాలకృష్ణ.. హగ్ చేసుకుని మరీ!

Balakrishna and Prabhas Broke into Tears: నందమూరి బాలకృష్ణ హోస్టుగా అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే అనే ఒక ఓటిటి షో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఆహా వీడియోలో ప్రసారమవుతున్న ఈ షో ఇప్పటికే విజయవంతంగా ఒక సీజన్ పూర్తి చేసుకోగా ప్రస్తుతం రెండో సీజన్ విజయవంతంగా నడుస్తోంది. బాలకృష్ణ ప్రభాస్ తో కలిసి చేసిన ఎపిసోడ్ కు సంబంధించి మొదటి భాగం ఇప్పటికే విడుదల కాగా రెండో భాగం జనవరి 6వ తేదీన విడుదలైంది.

ఇక ఈ ఎపిసోడ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది, ప్రభాస్ ప్రాణ స్నేహితుడిగా పేరు ఉన్న హీరో గోపీచంద్ కూడా ఈ ఎపిసోడ్ లో పాల్గొన్నారు. ఇక ఈ ఎపిసోడ్ లో కృష్ణంరాజు గురించి కొన్ని ఏవీలు ప్రసారం చేశారు. ఈ ఏవీలు చూసిన తర్వాత అటు నందమూరి బాలకృష్ణ ఇటు ప్రభాస్ ఇద్దరూ కూడా ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టుకున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఎపిసోడ్ లో భాగంగా ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు ప్రభాస్ గురించి ఏమనుకుంటున్నారు అంటూ ఒక వీడియో ప్లే చేయగా అందులో ప్రభాస్ గురించి కృష్ణంరాజు చాలా గొప్పగా చెబుతూ కనిపించారు. 

ఒకసారి తాను అంతర్వేది దగ్గరకు దర్శనానికి వెళితే అక్కడ నన్ను చూసి కొందరు పిల్లలు ప్రభాస్ నాన్నగారు అంటూ కామెంట్ చేయడం తనకు చాలా కిక్కు ఇచ్చిందని కృష్ణంరాజు పేర్కొన్నారు. సాధారణంగా కొడుకు కళ్ళ ముందే పెరిగి పెద్దవాడవుతుంటే ప్రతి తండ్రి ఆనంద పడతాడని కానీ తన కంటే పెద్దవాడైతే ఆ ఆనందం చెప్పలేనిదని ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు పేర్కొన్నారు. ఇక కృష్ణంరాజు మరణించిన సమయంలో ఏం జరిగిందనే విషయాన్ని కూడా ప్రభాస్ ఈ సందర్భంగా బయటపెట్టారు. అప్పటికే నెల రోజుల నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆయన చనిపోయే రోజు కూడా తాను డాక్టర్లతో మాట్లాడుతూనే ఉన్నానని ప్రభాస్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇక తనకు ఆయన మరణ వార్త తెలిసి చాలా బాధపడ్డానని కన్నీళ్లు ఆపుకోలేకపోయానని బాలకృష్ణ పేర్కొన్నారు. తాను అప్పుడు టర్కీలో ఉండడం వల్ల చివరి చూపు నోచుకోలేకపోయానని ఆయన పేర్కొన్నారు ఇక ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఒకపక్క నందమూరి బాలకృష్ణ మరోపక్క ప్రభాస్ ఇద్దరు కూడా ఎమోషనల్ అవుతూ కన్నీటి పర్యంతమయ్యారు. 

Also Read: Ghee From Animal Fat: తక్కువ రేటుకే నెయ్యి దొరుకుతుందని లొట్టలేస్తూ తింటున్నారా.. ఇది చదివితే ఇక ముట్టుకోరు!

Also Read: Thalapathy Vijay Divorce: భార్యకు విడాకులివ్వనున్న స్టార్ హీరో విజయ్.. అసలు విషయం ఏమిటంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News