Two Men Cheated People With Rs 1500 cr Debts: ఇద్దరు సాధారణ వ్యక్తులు. తమ వ్యాపార విస్తరణ కోసం అధిక వడ్డీ ఆశ చూపి భారీగా అప్పులు చేశారు.. చివరికి అప్పులిచ్చిన వారికి కుచ్చు టోపీ పెట్టారు. అచ్చం అగ్రిగోల్డ్ కుంభకోణం కాన్సెప్టులోనే ఏపీలో మరో మోసం చోటుచేసుకోగా.. ఈసారి కూడా మళ్లీ అదే తరహాలో జనం అధిక వడ్డీకి ఆశపడి లక్షలు, కోట్లు మోసపోయారు. అగ్రిగోల్డ్ ఒక సంస్థ కాగా.. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఈ మోసానికి తెర లేపారు. అది కూడా కేవలం వేలలో లక్షల్లో కాదు. ఏకంగా రూ.1500 కోట్లు అని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే హైదరాబాద్‌లో కేసు నమోదు కాగా.. ఏపీలో ఇంకా పోలీసుల వరకు వెళ్లలేదు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం దుగ్గిరాలపాడుకు చెందిన ఒకరు, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన మరొకరు కలిసి మార్కెటింగ్ వ్యాపారంలో అడుగు పెట్టారు. తొలుత హైదరాబాద్ కేంద్రంగా చాక్లెట్ల మార్కెటింగ్ చేపట్టారు. హైదరాబాద్ దుర్గంచెరువు ప్రాంతంలో నివాసముంటూ క్రమంగా కాస్మోటిక్, ఇతర ఉత్పతుల మార్కెటింగ్ స్టార్ట్ చేసారు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ఊభయ తెలుగురాష్ట్రాల్లో పలు చోట్ల అవుట్లెట్లు ఏర్పాటు చేసి, గిడ్డంగులు అద్దెకు తీసుకున్నారు. టర్నోవర్ కోట్లకు చేరింది. అధిక వడ్డీ ఆశ చూపించి అయిన కాడికి అప్పులు తీసుకున్నారు. గడువు లోగా వడ్డీ చెల్లిస్తుండటం, ఐదు రూపాయలకు మించి వడ్డీ ఇస్తుండటంతో బంధువులు, స్నేహితులు, ఇతరులు తమ స్థాయికి మించి అప్పులు ఇచ్చారు. బాధితుల్లో ఎక్కువ మంది ఎన్టీఆర్ జిల్లాకు చెందిన వారేనని తెలుస్తోంది.


అప్పులు చేసి మరీ ఇచ్చారు
ఇబ్రహీంపట్నానికి చెందిన ఒక స్టోన్ క్రషర్ యజమాని వంద కోట్లకు పైగా ఇచ్చినట్లు సమాచారం. పశ్చిమ, తూర్పు ఇబ్రహీంపట్నంకు చెందిన పలువురు పెద్దమొత్తంలో ఇచ్చినట్టుగా తెలిసింది. దుగ్గిరాలపాడులో మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు సైతం 10 లక్షల నుంచి 50 లక్షల వరకు ఇచ్చినట్లుగా చెపుతున్నారు. వీరులపాడు మండలం గూడెం మాధవరానికి చెందిన దగ్గరి బంధువులు సైతం కోట్లు అప్ప జెప్పారు. కంచికచర్లకు చెందిన ఒకరు 6.5 కోట్లు ఇచ్చి నట్టుగా సమాచారం. హైదరాబాద్ లో కూడా పలువురు వందల కోట్లలో అప్పులిచ్చారని చెబుతున్నారు. వ్యాపారం పేరుతో వీరిద్దరూ కలిసి 15 వందల కోట్లకు పైగా అప్పులు చేశారని అంటున్నారు. 


ఇది కూడా చదవండి : 13 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఆపై రాళ్లతో అమానుషం


ఈ నేపథ్యంలో రూ. 100 కోట్ల వరకు అప్పు ఇచ్చిన విజయవాడలోని ఒక బార్ నిర్వాహకులు, అప్పు తీర్చాల్సిందిగా కొద్ది రోజుల నుంచి వారిపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లుగా తెలిసింది. రేపు మాపు అంటూ ఫోన్ కూడా ఎత్తకపోవడంతో కృష్ణా జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి అనుచరులతో కలిసి బార్ నిర్వాహకులు 4 రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లారు. అక్కడే దుగ్గిరాలపాడుకు చెందిన వ్యక్తి ఇంటికి వెళ్లి గట్టిగా నిలదీశారు. ప్రజాప్రతినిది. అనుచరులు అతడిని తీవ్రంగా కొట్టారు. వాతలు కూడా పెట్టారు. ఈలోగా అతని భార్య 100 కు కాల్ చేయటంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ సంఘటనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని సమాచారం. ఈ మోసంలో కీలకమైన భీమవరానికి చెందిన భాగస్వామి కూడా.. తనపై కూడా అప్పు ఇచ్చిన వాళ్లు దాడి చేస్తారేమోనన్న భయంతో హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించినట్లుగా తెలిసింది. ఈ సంఘటన దరిమిలా ఒక క్రషర్ యజమాని తీవ్ర అస్వస్థతకు గురై హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తమ కుటుంబాలు రోడ్డున పడటంతో ఆ బాధ తట్టుకోలేక ఒకరిద్దరు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారని చెపుతున్నారు.


ఇది కూడా చదవండి : Honey Trap: హానీ ట్రాప్.. 50 మంది పురుషులను బెదిరించిన మహిళ.. రంగంలోకి దిగిన పోలీసులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి