Attack on Actor Naresh: నటుడు నరేష్ ఇంటిపై దాడి.. కారును ధ్వంసం.. ఎందుకంటే?

Attack on Actor Naresh: నటుడు నరేష్ నివాసం మీద గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసినట్లుగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశం అయింది. ఆ వివరాల్లోకి వెళితే  

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 19, 2023, 03:54 PM IST
Attack on Actor Naresh: నటుడు నరేష్ ఇంటిపై దాడి.. కారును ధ్వంసం.. ఎందుకంటే?

Attack on Actor Naresh House: గత కొన్నాళ్లుగా సినీ నటుడు నరేష్ అనూహ్యంగా వార్తల్లోకి ఎక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి ఆయన వార్తల్లోకి ఎక్కాడు. నటుడు నరేష్ నివాసం మీద గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసినట్లుగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో ఈ దాడిలో నరేష్ కు చెందిన కేరవాన్ వెహికల్ తో పాటు ఇతర కార్లు కూడా ధ్వంసం అయ్యాయని తెలుస్తోంది. ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులను నరేష్ ఆశ్రయించారు.

ఈ దాడి వెనుక తన భార్య రమ్య రఘుపతి హస్తం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఆమె కారులో తన ఇంటికి వచ్చిన కొద్దిసేపటికి తన మీద అటాక్ జరిగిందని అందుకే తనకు ఆమె చేయించిందని అనుమానం ఉందని ఆయన ఆరోపిస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి నరేష్ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు తన ఇంటి సీసీ ఫుటేజ్ ను సైతం పోలీసులకు అందించారు. నరేష్ రమ్య రఘుపతి కొన్నాళ్ల క్రితం వివాహం చేసుకున్నారు, వారికి ఒక కుమారుడు కూడా జన్మించాడు. కానీ వారిద్దరికీ మధ్య మనస్పర్థలు రావడంతో దూరంగానే ఉంటున్నారు. అయితే మనసులు దూరంగా ఉంటున్నా మనుషులు మాత్రం కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు.

అయితే నరేష్ పవిత్ర లోకేష్ ని నాలుగో వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారని ఆరోపణలు వినిపించిన నేపథ్యంలో తెరమీదకు వచ్చిన రమ్య రఘుపతి పెద్ద రాద్ధాంతమే సృష్టించారు. రమ్య రఘుపతి నరేష్ కలిసి మైసూరులో ఒక హోటల్ గదిలో ఉండగా అక్కడికి వెళ్లి కూడా హడావిడి చేశారు.

ఇక ఈ మధ్య నరేష్ పవిత్ర లోకేష్ కొత్త జీవితానికి నాంది పలుకుతున్నామంటూ పెట్టిన ఒక పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా నరేష్ నాలుగో పెళ్లి చేసుకుంటాడని అందరూ అనుకున్నారు. కానీ తమకు అసలు విడాకులే అవ్వకుండా ఆయన నాలుగో పెళ్లి ఎలా చేసుకుంటాడని నరేష్ భార్య రమ్య రఘుపతి ప్రశ్నిస్తున్నారు. చూడాలి ఈ విషయం ఎంత దూరం వెళ్లబోతుంది అనేది.

Also Read: Taraka Ratna Children: తారకరత్నకు కుమార్తె మాత్రమే కాదు.. ఒక వారసుడు కూడా ఉన్నాడు తెలుసా?

Also Read: Curse on Nandamuri Family: నందమూరి కుటుంబానికి శాపం.. నాలుగేళ్ల వ్యవధిలోనే మరణాలు అందుకేనా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 

Trending News