India Biggest Data Breach : ప్రస్తుతం ప్రతిదానికి ప్రతి ఒక్కరికి చాలా అవసరమైనది ఆధార్స ఎక్కడికి వెళ్ళిన భారతీయులకు ఈ కార్డు అనేది అవసరం పడుతూనే ఉంటుంది. కానీ ఆధార్ గోప్యత విషయంలో మరోసారి ఆందోళన నెలకొంది. ఇప్పుడు వరకు ఎప్పుడు జరగని ఒక ఆశ్చర్యమైన పరిస్థితి ఏర్పడింది. ఎన్నడూ లేని విధంగా అతిపెద్ద డేటా లీక్ వ్యవహారం కలకలం రేపుతోంది. అది కూడా 81.5 కోట్ల మంది భారతీయుల ఆధార్ సమాచారం.. డార్క్ వెబ్‌లో అమ్మకానికి ఉంచడం ఒక్కసారిగా భారతదేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ‘పిడబ్ల్యూఎన్‌0001’ అనే హ్యాకర్‌ చోరీ చేసిన సమాచారాన్ని డార్క్‌వెబ్‌లో పోస్ట్‌ చేయడంతో దేశంలోని అతి పెద్ద డేటా లీక్‌ వెలుగులోకి వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలు విషయానికి వస్తే ICMR వద్ద అందుబాటులో ఉన్న 81.5 కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత సమాచారం డార్క్ వెబ్‌సైట్‌లో విక్రయానికి అందుబాటులో ఉంది. 



ఇక ఈ లీక్ అయిన డేటాలో ఆధార్, పాస్‌పోర్ట్ వివరాలతోపాటు పేరు, ఫోన్ నంబర్, అడ్రస్ వంటి ముఖ్యమైన సమాచారాన్ని హ్యాకర్లు ‘బ్రీచ్‌ ఫోరమ్స్‌’పై పోస్ట్‌ చేసినట్టు పేర్కొంటున్నారు. ఇదే విషయాన్ని అందరికీ తెలియజేస్తూ దాదాపు 81.5 కోట్ల మంది వ్యక్తుల వ్యక్తిగత సమాచారం లీక్ అయినట్లు అమెరికా సైబర్ సెక్యూరిటీ సంస్థ రిసెక్యూరిటీ పేర్కొంది. ఇక ఈ వ్యవహారం బయటకు రావడంతో ఆధార్‌లో నిక్షిప్తమైన భారతీయుల బయోమెట్రిక్‌ వివరాల భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



ఈ డాటా చోరీ విషయాన్ని ముందుగా గుర్తించిన ‘రీసెక్యూరిటీ’.. అక్టోబర్ 9వ తేదీన PWN0001 అనే మారుపేరుతో పిలిచే ఒక వ్యక్తి 81.5 కోట్ల మంది భారతీయ పౌరుల ఆధార్, ఆధార్ వివరాలను ఉల్లంఘన ఫోరమ్‌లో పోస్ట్ చేసినట్లు వెల్లడించింది. ఒక అంచనా ప్రకారం ప్రస్తుతం భారత్‌ జనాభా 148 కోట్ల 60 లక్షలు. కాగా ఇందులో 81.5 కోట్ల మంది వివరాలు లీక్ కావడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. అనగా సగటున 59% మంది భారతీయుల డేట్ లీక్ అయింది. 


తమ వద్దనున్న డాటాకు రుజువుగా అజ్ఞాత వ్యక్తి నాలుగు శాంపిల్స్‌ను కూడా బయటపెట్టినట్లు తెలిపింది. 
ఒక్కో శాంపిల్‌లో లక్ష మందికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. 


ఇక ఈ విషయం తెలియగానే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా  డేటా లీక్ గురించి ICMRని అప్రమత్తం చేసింది. ఇక దాంతో ప్రభుత్వ సంస్థలు, మంత్రిత్వశాఖలకు చెందిన ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు.


Also read: Tata Nexon Facelift 2023: అతి తక్కువ ధరలోనే టాటా నెక్సాన్ నుంచి మరో నంబర్-1 SUV..ఫీచర్స్‌, ధర వివరాలు ఇవే!


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook