Valentines Day 2023 Shocking News : వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రియుడితో సరదాగా ఎంజాయ్ చేసి వాలెంటైన్స్ డేని ఎప్పటికీ గుర్తుండిపోయేలా మల్చుకుందామని భావించిన ప్రియురాలిని ఆమె ప్రియుడే కడతేర్చాడు. అంతకంటే ముందుగా ఆమెపై దారుణంగా అత్యాచారం చేశాడు. ఆమె ప్రైవేట్ పార్ట్స్‌లో ఐరన్ రాడ్ జొప్పించి మరీ నరకం చూపించాడు. తనని నమ్మి వచ్చిన ప్రియురాలిని నొటోరియస్ కిల్లర్‌గా మారి దారుణంగా హత్య చేశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సభ్య సమాజం తలదించుకునేలా చేసిన ఈ ఘటన జార్ఖండ్‌లోని గర్వ జిల్లా అజ్ని గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఆదివారం ఈ ఘటన జరగ్గా.. యువతి శవం ఆమె ప్రియుడి ఇంటికి సమీపంలోనే ఉన్న పొలాల్లో సోమవారం లభించింది. యువతి శవం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 


17 ఏళ్ల యువతిని ఆమె ప్రియుడే అతి దారుణంగా రేప్ చేసి, ప్రైవేట్ పార్ట్స్‌లో ఐరన్ రాడ్ చొప్పించి మరి హతమార్చినట్టు తెలుస్తోందని గర్వ జిల్లా పోలీసులు వెల్లడించారు. ఆ యువతి ఆదివారం రాత్రి తన ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా తన ప్రియుడిని కలిసేందుకు వెళ్లిందని.. మరునాడు ఉదయం అతడి ఇంటికి సమీపంలోనే శవమై తేలిందని కేసు దర్యాప్తు చేస్తోన్న సంతోష్ కుమార్ రవి తెలిపారు. నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సంతోష్ కుమార్ స్పష్టంచేశారు.


రేప్ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించేందుకు స్థానికులు సైతం అతడి ఇంటికి వెళ్లి చూశారు. కానీ అప్పటికే అతడు అక్కడి నుంచి పరారైనట్టు తెలుస్తోంది. నిందితుడి మొబైల్ ఫోన్ సిగ్నల్స్ లొకేషన్ ఆధారంగా నిందితుడని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్టు గర్వ జిల్లా పోలీసులు తెలిపారు.


ఇది కూడా చదవండి : ATM Robbery: ఏటీఎం నుంచి సినీ ఫక్కీలో రూ. 5.60 లక్షలు చోరీ.. ఒక్క క్లూ లేదు.. ఎలాగో తెలుసా ?


ఇది కూడా చదవండి : Jharkhand Woman Murder Case: భార్యను దారుణంగా హత్య చేసిన భర్త.. ఎక్కడ దాచాడో తెలిసి అవాక్కైన పోలీసులు..!


ఇది కూడా చదవండి : Jalakantha Lucky Stone: లక్కీ స్టోన్ జలకాంత అని చెప్పి రూ. 2 కోట్లకు ఉత్తి రాయిని అమ్మబోయారు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook