Grand Daughter Rape Case: లైంగిక వాంఛ ఆ వృద్ధుడిలోని క్రూర మృగం బయటకు తీసుకొచ్చింది. అతడి వికృత చేష్టలు మరింత జుగుప్సకరంగా మారాయి. ఇంట్లో ఉన్న మనవరాలికి సుద్దులు, బుద్ధులు నేర్పాల్సిన తాతయ్య దారుణానికి తెగబడ్డాడు. వావివరుసలు.. వయసు బేధం చూసుకోలేదు. బాలిక అని కూడా చూడలేదు. తన కామానికి సొంత మనవరాలిని వాడేసుకున్నాడు. అభం శుభం తెలియని బాలికపై నికృష్ట పని చేశాడు.  ఇలా ఒకసారి కాదు చాలాసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. తన తాత ద్వారా ఇబ్బంది పడుతున్న విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పి రోదించింది. వెంటనే వృద్ధుడిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. అతడిపై పోక్సో కోర్టు సంచలన తీర్పు నిచ్చింది. ఈ మేరకు విశాఖపట్టణం ప్రత్యేక పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5 లక్షల జరిమానా విధించింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Loan App: రూ.10 వేలకు రూ.లక్ష చెల్లించాలని వేధింపులు.. కట్టలేక కృష్ణా నదిలో దూకిన విద్యార్థి


 


విశాఖపట్టణం జిల్లా మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధుడు శ్యామ్‌ సుందర్‌ కుటుంబంతో నివసిస్తున్నాడు. ఇంట్లో 5వ తరగతి చదువుతున్న మనవరాలు ఉంది. కొన్ని రోజులుగా బాలికపై శ్యామ్‌ సుందర్‌ కన్నేశాడు. లైంగిక వాంఛ తీర్చుకోవాలని అదును చూస్తున్నాడు. ఈ క్రమంలో ఒకరోజు ఇంట్లో ఎవరూ లేరు. మనవరాలు అతడు మాత్రమే ఉన్నారు. ఇదే సరైన సమయంగా భావించి మనవరాలిపై లైంగిక దాడి చేశాడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Also Read: Oyo Room Death: ఓయో రూమ్‌లో ఏపీ ఉపాధ్యాయుడు మృతి.. పెళ్లి కాకపోవడమే కారణమా?


 


దిశ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ కేసును విశాఖపట్టణం స్పెషల్ పోక్సో కోర్టు విచారణ చేపట్టింది. స్పెషల్ పోక్సో జడ్జి ఆనంది నిందితుడు శ్యామ్‌సుందర్‌ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత మనవరాలిపై అఘాయిత్యానికి పాల్పడడం జడ్జి తీవ్రమైన నేరంగా పరిగణించి వృద్ధ కామ పిశాచికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు. అంతేకాకుండా రూ.5 లక్షల జరిమానా విధిస్తూ జడ్జి ఆనంది సోమవారం తీర్పునిచ్చారు. బాధితుల తరుపున స్పెషల్ పోక్సో పీపీ కరణం కృష్ణ వాదించి న్యాయం జరిగేలా చూశారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook