Oyo Room Death: ఓయో రూమ్‌లో ఏపీ ఉపాధ్యాయుడు మృతి.. పెళ్లి కాకపోవడమే కారణమా?

AP Teacher Death In Oyo Lodge Hyderabad: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తెలంగాణలో ఓయో రూమ్‌లో మృతి చెందడం కలకలం రేపింది. అతడి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 26, 2024, 07:36 PM IST
Oyo Room Death: ఓయో రూమ్‌లో ఏపీ ఉపాధ్యాయుడు మృతి.. పెళ్లి కాకపోవడమే కారణమా?

AP Teacher Oyo Lodge: ఆంధ్రప్రదేశ్‌లో అదృశ్యమైన ప్రభుత్వ ఉపాధ్యాయుడు తెలంగాణలో విగతజీవిగా మారాడు. ఏపీ నుంచి వచ్చిన అతడు హైదరాబాద్‌లో ఓ రూమ్‌లో మృతి చెంది కనిపించాడు. అయితే అతడి మృతిపై చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ నుంచి ఇక్కడకు ఎలా వచ్చాడు? హైదరాబాద్‌లో ఎలా చనిపోయాడు? అనేది అనుమానాస్పద ప్రశ్నలు వస్తున్నాయి. అసలు చనిపోవడానికి కారణాలు ఏమిటనేవి ఆసక్తికరంగా మారాయి. పోలీసుల వివరాల ప్రకారం కథనం ఇలా ఉంది.

Also Read: Anwarul Azim Anar Case: మహిళను ఎరగా వేసి ఎంపీ హత్య.. శరీరాన్ని ముక్కలుగా కోసి పసుపు పెట్టి పడేశారు

ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్‌ కడప జిల్లా రాయచోటిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా జయప్రకాశ్‌ నారాయణ (35) బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో కుటుంబంతో సహా జయప్రకాశ్‌ నారాయణ హైదరాబాద్‌కు వచ్చాడు. కూకట్‌పల్లిలోని బాలాజీనగర్‌లో కుటుంబసభ్యులతో నివసిస్తున్నాడు. ఇక్కడే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. అయితే మే 25వ తేదీన శనివారం జయప్రకాశ్ అదృశ్యమయ్యాడు. అతడు కనిపించడం లేదని కుటుంబసభ్యులు కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆదివారం మదీనాగూడలోని ఓయో లాడ్జి నిర్వాహకులు మియాపూర్‌ పోలీసులకు ఫోన్‌ చేశారు. జయప్రకాశ్‌ నారాయణ వ్యక్తి మరణించాడని సమాచారం రావడంతో పోలీసులు వెళ్లి చూశారు.

Also Read: Kiss Stops Marriage: ప్రేమతో పెట్టిన ముద్దుతో వివాహం రద్దు.. ఆస్పత్రిలో వరుడు

మృతుడు జయప్రకాశ్‌గా గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కుటుంబీకులు వచ్చి పరిశీలించగా తమ జయప్రకాశ్‌గా నిర్ధారించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మియాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే జయప్రకాశ్ ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు స్వస్థలం రాయచోటి వెళ్తున్నానని చెప్పి కూకట్‌పల్లి నుంచి బయల్దేరి వెళ్లాడు. ఆ తర్వాత అతడి ఆచూకీ లభించలేదు. లాడ్జిలో జయప్రకాశ్‌ ఎలా మరణించాడనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News