Whatsapp Group Admin Tongue Cut: పూణెలో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. హ్యాపీ న్యూయర్ అని చెప్పనందుకు పూణెలో ఓ వ్యక్తి చేయి విరగ్గొట్టిన మరువకముందే.. వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించినందుకు గ్రూప్ అడ్మిన్‌ను తీవ్రంగా కొట్టి నాలుక కోసిన షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పూణెలోని ఫుర్సుంగిలో వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి సొసైటీ సభ్యులు తొలగించారంటూ వాగ్వాదం జరిగింది. దీంతో గ్రూప్‌ అడ్మిన్‌ను ఐదుగురు వ్యక్తులు దారుణంగా కొట్టారు. అనంతరం అడ్మిన్ నాలుక కోసేసి పారిపోయారు. బాధితుడు ఆసుపత్రిలో చేరగా.. పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పుణె నగరం ఫుర్సుంగిలోని ఓ హౌసింగ్‌ సొసైటీ ఉంది. ఈ సొపైటీకి సంబంధించి ఓం హైట్స్‌ ఆపరేషన్‌ పేరుతో బాధితుడు గ్రూప్ క్రియేట్ చేశాడు. ఇందులో సొసైటీకి సభ్యులు అందరూ ఉన్నారు. అయితే ఇటీవల ఓ సభ్యుడిని గ్రూప్ నుంచి తొలగించాడు అడ్మిన్. ఎందుకు గ్రూప్ నుంచి తొలగించావంటూ ఆ సభ్యుడు కోపంతో అడ్మిన్‌కు మెసేజ్ పెట్టాడు. అయినా అడ్మిన్ రిప్లై ఇవ్వలేదు.


దీంతో అడ్మిన్‌కు ఫోన్ చేసి కలవాలని అనుకుంటున్నానని చెప్పాడు. తనతో పాటు మరో నలుగురిని తీసుకువెళ్లి.. అడ్మిన్‌తో వాగ్వాదానికి దిగాడు. తనను గ్రూప్ నుంచి ఎందుకు తొలగించారని ప్రశ్నించాడు. ఈ క్రమంలో అందరూ కలిసి అతడిపై దాడికి దిగారు. అనంతరం నాలుక కోసి అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు గమనించి వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు నాలుకకు కుట్టు వేయగా.. బాధితుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.


అంతకు ముందు కొత్త సంవత్సరం ప్రారంభం సందర్భంగా పూణెలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. నూతన సంవత్సర శుభాకాంక్షల వివాదంలో ఓ యువకుడిపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. మద్యం మత్తులో యువకులు రోడ్డుపై వెళ్తున్న వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలో ఓ యువకుడు హ్యాపీ న్యూయర్ చెప్పకపోవడంతో నలుగురు కలిసి ఆ యువకుడిపై గొడ్డలితో దాడి చేసి చేయి విరగ్గొట్టారు.


Also Read: AP Politics: ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీతో గుబులు.. ఎవరికి నష్టం..?  


Also Read: IND vs SL: ఆఖరి ఓవర్లో హార్ధిక్ పాండ్యా డేరింగ్ స్టెప్.. టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook