Loan App Harassment in Kadiyam: ఆన్‌లైన్‌లో కేటుగాళ్ల మోసాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రజలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. కొత్త కొత్త మార్గాల్లో ప్రజలను మోసం చేసేందుకు రెడీ అవుతున్నారు. అదేవిధంగా ఆన్‌లైన్‌ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. ఇప్పటివరకు లోన్ యాప్‌లను సంప్రదించి అప్పు తీసుకున్న వారినే వేధించిన సంఘటనలు చూశాం.. కానీ తూర్పుగోదావరి జిల్లా కడియంలో అడగకుండానే అకౌంట్‌లోకి డబ్బులు పంపించి.. వేధించిన ఘటన చోటు చేసుకుందిన. వివరాల్లోకి వెళితే.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కడియం మండలంలో నివాసముండే దేవి అనే మహిళ శనివారం దిశా SOSకు కాల్ చేసి.. తనను లోన్ యాప్ నిర్వాహకుడు వేధిస్తున్నట్లు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో బాధితురాలి ఇంటికి వెళ్లిన దిశ పోలీసులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని రోజుల కిందట గుర్తుతెలియని నెంబర్ నుంచి తనకు 2000 రూపాయలు ఫోన్ పే ద్వారా వచ్చాయని ఆమె తెలిపింది.


అయితే వెంటనే అదే నెంబర్‌కు అమౌంట్‌ను తిరిగి పంపించినట్లు వివరించింది. ఇక అప్పటి నుంచి అదే నెంబర్‌తో వాట్సాప్ కాల్ చేసిన వ్యక్తి హిందీ ఇంగ్లీషులో మాట్లాడుతూవేధింపులకు పాల్పడుతున్నట్లు బాధితురాలు వాపోయింది. అదనంగా డబ్బులు చెల్లించాలని లేదంటే తన ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బాధితురాలిని బెదిరించాడు. ఆగంతకుడు చెప్పిన విధంగానే బాధితురాలి ఫొటోలను మార్ఫింగ్ చేసి న్యూడ్ ఫొటోలను పంపించడం మొదలుపెట్టాడు. ఆగంతకుడి ఆకృత్యాలు శృతిమించడంతో బాధితురాలు దిశా పోలీసులకు కాల్ చేసి సమాచారం ఇచ్చింది.


బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దిశా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆగంతకుడు కాల్ చేసిన ఫోన్ నెంబర్, ఇతర వివరాల ఆధారంగా కడియం పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. అజ్ఞాత వ్యక్తులు ఎవరైనా ఫోన్ చేసి వేధింపులకు పాల్పడితే వెంటనే దిశ SOSకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు పోలీసులు సూచించారు. గుర్తుతెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్, మెసేజ్‌లకు స్పందించకండని చెప్పారు. ఎవరైనా లింక్‌ పంపించి క్లిక్ చేయమన్నా.. మీ మొబైల్ నంబరుకు వచ్చిన ఓటీపీలు చెప్పమని అడిగినా.. అస్సలు చెప్పకండి అని కోరారు.


Also Read: CSK Vs GT Dream11 IPL Final Match Dream11 Prediction: ఐపీఎల్ ఫైనల్‌కు వేళయా.. గుజరాత్‌కు చెన్నై చెక్ పెడుతుందా..? డ్రీమ్ 11 టీమ్ టిప్స్ ఇవే..


Also Read: CSK Vs GT IPL 2023: క్షణాల్లో మ్యాచ్‌ మార్చేసే వీరులు.. ఈ ఐదుగురు ఆటగాళ్లపై ఓ లుక్కేయండి..!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి