Gangrape in front Husband: భర్తతో పాటు అత్తింటి వారితో గొడవ పడిన ఓ 22 ఏళ్ల యువతి.. వారిపై కోపంతో అలిగి అమ్మగారింటికి బయలుదేరగా.. ఆమె ఒంటిరిగా రోడ్డుపై వెళ్లడం చూసిన కామాంధులు రెచ్చిపోయి లైంగిక దాడికి తెగబడ్డారు. జార్ఖండ్ లోని పాలం జిల్లాలో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. పాలం జిల్లా ఎస్పీ చందన్ కుమాక్ సిన్హా మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం లాహెహార్ జిల్లాకు చెందిన యువతికి పాలం జిల్లాకు చెందిన యువకుడితో వివాహమైంది. ఆదివారం ఆమెకు అత్తింటి వారితో వాగ్వీవాదం తలెత్తింది. అత్తింటి వారితో ఘర్షణ పడిన యువతి.. ఇక ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేనంటూ అదే క్షణం తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లేందుకు బయల్దేరింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాత్రి 8 గంటల ప్రాంతంలో కాలి నడకన రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న యువతిని చూసిన కామాంధులు పథకం ప్రకారం ఆమెను అనుసరించారు. అయితే, అదే సమయంలో మరో బంధువుతో కలిసి భార్యను వెతికేందుకు బయల్దేరాడు ఆమె భర్త. ఎట్టకేలకు సత్బర్వ పోలీసు స్టేషన్ పరిధిలోని బకోరియా బలౌచి లోయ వద్ద రోడ్డుపై ఆమె ఒంటరిగా వెళ్తూ కనిపించింది. అప్పటికే సమయం రాత్రి 8 గంటలు అవుతుండటంతో తన భార్యను క్షేమంగా ఇంటికి తీసుకెళ్లేందుకు ఆమెని ఒప్పించసాగాడు. ఆమె మాట వినకపోవడంతో బతిమాలాడసాగాడు. కానీ ఇంతలోనే మోటార్ బైకులపై వారి వద్దకు వచ్చిన ఆరుగురు దుండగులు.. ఆమె భర్త, బంధువుపై విచక్షణారహితంగా దాడిచేసి వారి కళ్ల ముందే ఆమె పక్కకు తీసుకెళ్లారు. తీవ్రంగా గాయపడిన భర్త ప్రాధేయపడినా వినకుండా ఆమెపై ఆరుగురు గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డారు. 


అంతటితో ఊరుకోని దుండగులు ఆమెను బైకుపై బలవంతంగా ఎక్కించుకుని అక్కడి నుంచి మరో చోటికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ఆమె గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వారిని అడ్డుకుని బాధితురాలిని రక్షించారు. ఆరుగురిలో నలుగురు అక్కడి నుంచి పరారవగా.. ఇద్దరిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆ ఆరుగురిలోనూ ఇద్దరు తనకు తెలిసిన వారేనని బాధితురాలి భర్త పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇవాళ మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఆరుగురిని అరెస్ట్ చేశామన్న పోలీసులు.. నిందితులకు శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.


Also Read : Rape Incident: తెలంగాణలో మరో గ్యాంగ్ రేప్ ఘటన..మత్తు మందు ఇచ్చి దారుణం


Also Read : Zomato Delivery Boy: మహిళా కస్టమర్‌కి ఫుడ్ డెలివరీ బాయ్ ముద్దులు.. స్పందించిన జొమాటో



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి