Murder Case With Illegal Affairs: అల్లూరి జిల్లా జీకే వీధి మండలం జెర్రల పంచాయితీ కొండకించంగిలో ఈ నెల 24వ తారీఖున జరిగిన చిన్నారావు హత్య కేసుని ఛేదించిన పోలీసులు.. మూడు రోజుల వ్యవధిలోనే నిందితులను పట్టుకొని అరెస్టు చేశారు. ఈ కేసును సీరియస్ గా పరిగణించిన అల్లూరి జిల్లా ఎస్పీ తుహన్ సిన్హా ఆదేశాల మేరకు చింతపల్లి ఏఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆధ్వర్యంలో జీకే విధి సీఐ అశోక్ కుమార్, ఎస్సై అప్పలసూరి ఈ కేసును  సవాల్ గా తీసుకొని ముమ్మరంగా దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. సిఐ అశోక్ కుమార్ మీడియా సమావేశంలో చిన్నా రావు హత్యకు సంబంధించిన  వివరాలు వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చిన్నారావుకు నిందితుడు మల్లన్న భార్య అనూషకు గత కొంత కాలంగా అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో మృతుడు చిన్నారావు కొండపల్లికి చెందిన సత్య అనే వేరే మహిళను పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉండటాన్ని గమనించిన అనూష ఎట్టి పరిస్థితుల్లో వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవద్దని పలుమాలు హెచ్చరించింది. అయినప్పటికీ చిన్నారావు మాట వినకపోవడంతో గొడవపడి ఎలాగైనా హతమార్చాలని స్కెచ్ వేసిన అనూష.. అందుకోసం తెలివిగా తన భర్తనే ఉపయోగించుకుంది. 


తన మాట వినకుండా మరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిన చిన్నా రావును తన భర్త అయిన మల్లన్నకు ఏవేవో చెప్పి అతడిపైకి దాడికి రెచ్చగొట్టి హత్య చేయించింది అని పోలీసులు విచారణలో వెల్లడైంది. నిందితుడైన మల్లన్నను అతని భార్య అనూషను అరెస్టు చేసిన జికే వీధి పోలీసులు.. నిందితులు ఇద్దరినీ రిమాండ్ కు తరలిస్తున్నట్టు జీకే వీధి సి ఐ అశోక్ కుమార్ మీడియాకు తెలిపారు.