Teacher Eloped With Student: జైపూర్ : తన వద్ద చదువుకుంటున్న 17 ఏళ్ల విద్యార్థినితో కలిసి వెళ్లిపోయిన ఓ మహిళా టీచర్‌ని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో విద్యార్థినిని వెంట తీసుకెళ్లినందుకుగాను ఆమెపై కిడ్నాప్ కేసుతో పాటు పోక్సో యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మహిళా టీచర్ ని పోలీసులు స్థానిక కోర్టులో హాజరుపర్చగా కోర్టు ఆమెకు 15 రోజుల పాటు జుడిషియల్ కస్టడీని విధించింది. టీచర్ తీసుకెళ్లిన విద్యార్థినిని చట్టరీత్యా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. రాజస్థాన్‌లోని బికనేర్‌‌ సమీపంలో ఉన్న శ్రీదుంగడ్‌ఘడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జూన్ 30న విద్యార్థినితో కలిసి టీచర్ అదృశ్యమైంది. టీచర్ వయస్సు 21 ఏళ్లు. ఈ ఘటన మైనర్ బాలిక కుటుంబాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. తమ కూతురు విషయంలో లవ్ జిహాద్ కోణం ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అని మైనర్ బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు. స్థానికులు సైతం ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం బికనేర్ బంధ్‌కి సైతం పిలుపునిచ్చారు. దీంతో స్థానికంగా ఈ ఘటన ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. 


విద్యార్థిని కిడ్నాప్ వెనుక లవ్ జిహాద్ కోణం ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నందున మహిళా టీచర్‌ని తక్షణమే అరెస్ట్ చేయాలని.. ఆమె ఆచూకీ లభించని పక్షంలో ఆమె కుటుంబసభ్యులను అదుపులోకి తీసుకుని విచారించాలి అని స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఇదిలావుంటే, మరోవైపు విద్యార్థినిని తీసుకుని వెళ్లిపోయిన మహిళా టీచర్ కుటుంబసభ్యులు సైతం ఆమె అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు టీచర్ ఆచూకీ లభించడంతో పోలీసులు ఆమెని అరెస్ట్ చేసి కోర్టులో హజరుపర్చడంతో స్థానికంగా ఉద్రిక్తతల నుంచి కొంత ఉపశమనం లభించింది. 


వీడియో విడుదల చేసిన టీచర్, విద్యార్థిని..
తాము ఇద్దరం ఊరు విడిచిపెట్టి వెళ్లిపోయిన అనంతరం బికనేర్‌లో పరిస్థితులు అదుపుతప్పుతున్నాయని.. తమ అదృశ్యం కేసు మతం రంగు పులుముకుంటోందని గ్రహించిన విద్యార్థిని.. సోమవారం సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో విడుదల చేసింది. తాను, టీచర్ ఇద్దరం లెస్బియన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నామని.. తను ఇష్టపూర్వకంగానే టీచర్ తో కలిసి వెళ్లిపోయానన్నట్టుగా చెప్పుకొచ్చిన సదరు విద్యార్థినిని.. తమ అదృశ్యానికి మతం రంగు పులుమొద్దని ఆ వీడియోలో వేడుకుంది. ఈ ఘటనను పెద్ద వివాదం చేయకుండా ఇంతటితో వదిలేయాల్సిందగా ఆ విద్యార్థినిని స్పష్టంచేసింది.


ఇది కూడా చదవండి : Suicide By Cutting off His Penis: షాకింగ్ న్యూస్.. పురుషాంగం కోసుకుని ఎంబీబీఎస్ స్టూడెంట్ సూసైడ్


ఆ ఇద్దరూ ఎలా దొరికారంటే..
వీడియో విడుదల చేసిన అనంతరం విద్యార్థిని, టీచర్ ఇద్దరూ తమిళనాడులో ఉన్నట్టు గుర్తించిన బికనేర్ పోలీసులు.. వెంటనే చెన్నై పోలీసులను అప్రమత్తం చేశారు. బికనేర్ పోలీసులు ఇచ్చిన వివరాలతో చెన్నై పోలీసులు బుధవారం వారిని అదుపులోకి తీసుకుని బికనేర్ పోలీసులకు అప్పగించారు.


ఇది కూడా చదవండి : Child Marriage News: 13 ఏళ్ల బాలికతో 45 ఏళ్ల వ్యక్తికి పెళ్లి.. అర్ధరాత్రి అరాచకం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK