రూంలో దిగండి.. రూ. 1000కే అమ్మాయితో ఎంజాయ్‌ చేయండి! సంచలనంగా మారిన అడ్వటైజ్‌మెంట్‌ బోర్డ్‌

Chennai Controversial Electronic Signboard shaakes internet. 'రూంలో దిగండి.. రూ. 1000కే ఏ అమ్మాయితో అయినా ఎంజాయ్‌ చేయండి' అనే బోర్డ్‌ చెన్నైలోని లిటిల్ మౌంట్‌ ఏరియాలో వెలిసింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 27, 2022, 01:35 PM IST
  • రూంలో దిగండి
  • రూ. 1000కే అమ్మాయితో ఎంజాయ్‌ చేయండి
  • సంచలనంగా మారిన అడ్వటైజ్‌మెంట్‌ బోర్డ్‌
రూంలో దిగండి.. రూ. 1000కే అమ్మాయితో ఎంజాయ్‌ చేయండి! సంచలనంగా మారిన అడ్వటైజ్‌మెంట్‌ బోర్డ్‌

Chennai Controversial Electronic Signboard: వ్యాపార అభివృద్ధి కోసం షాపింగ్ మాల్స్ నిర్వహకులు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తుంటారు. బిగ్ సేల్, మెగా ఆఫర్, ఫెస్టివల్ ధమాకా అంటూ కొనుగోలు దారులను ఆకర్షిస్తుంటారు. పండగ సందర్భాల్లో అయితే భారీ డిస్కౌంట్లు ఇస్తుంటారు. అంతేకాదు ఒకటి కొంటే.. మరో రెండు ఫ్రీ అని కూడా ప్రకటిస్తుంటారు. అయితే ఓ లాడ్జి నిర్వహకులు పెట్టిన ఆఫర్ మాత్రం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. అదే సమయంలో ఈ ఆఫర్‌పై మహిళలు ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే... 

'రూంలో దిగండి.. రూ. 1000కే ఏ అమ్మాయితో అయినా ఎంజాయ్‌ చేయండి' అనే బోర్డ్‌ చెన్నైలోని లిటిల్ మౌంట్‌ ఏరియాలో వెలిసింది. అన్నా సలైలోని ఓ హోటల్‌లోని ఎల్‌ఈడీ డిస్‌ప్లే బోర్డ్‌లో క్లారిటీగా కనిపించేలా డిజిటల్‌ బోర్టును ఏర్పాటు చేశారు. బ్లాక్ కలర్ బోర్డుపై రెడ్ అక్షరాలతో ఆ మార్గంలో వెళ్ళేవారిని ఇట్టే ఆకర్షిస్తోంది. బోర్డును గమనించిన అటుగా వెళ్ళే వ్యక్తులు కొందరు చూసి నవ్వుకున్నారు. మరికొందరు చూసీచూడనట్టుగా వెళ్లిపోయారు.

అయితే అటుగా వెళ్లిన ఓ వ్యక్తి మాత్రం ఎల్‌ఈడీ డిస్‌ప్లే బోర్డ్‌ను ఫోటో తీసి సీటీ పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. మహిళలంటే విలువలేదా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ (ఐద్వా) రాష్ట్ర విభాగం డిసెంబరు 24న నిరసన ప్రదర్శన నిర్వహించింది. హోటల్ యజమాని పైన చర్యలు తీసుకోవాలని చెన్నై పోలీసులను డిమాండ్ చేసింది. వెంటనే స్పందించిన గిండి పోలీసులు రంగంలోకి దిగి డిజిటల్‌ బోర్డ్‌కు కరెంట్‌ కట్‌ చేశారు. అనంతరం ఆ బోర్డ్‌ను తొలగించారు.

ఈ ఘటనపై పోలీసులు విచారణ చేశారు. లాడ్జిలో జరుగుతున్న కార్యకలాపాలపై ఆరా తీశారు. అయితే ఎల్‌ఈడీ డిస్‌ప్లే బోర్డులోని అక్షరాలు ఎలా మారాయో తనకు తెలీదని లాడ్జి నిర్వాహకులు పోలీసులతో చెప్పారు. ఈ ఘటనలో తమ తప్పు ఏమీ లేదని, విచారణకు అన్ని విధాలుగా సహకరిస్తామని పేర్కొన్నారు. ఏదేమైనా ఈ విషయం చెన్నై నగరంతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. లాడ్జికి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో ట్వీట్లు హోరెత్తుతున్నాయి. ముఖ్యంగా మహిళలు తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Sankranti Holidays: ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఈసారి మూడు హాలిడేస్ మిస్!  

Also Read: Cheap Tata Nexon Cars: డెడ్ చీప్‌గా టాటా నెక్సాన్‌ కారు.. కేవలం రూ. 6 లక్షలకే ఇంటికి తీసుకెళ్లండి!   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Trending News