Honey Trap: ఈ మధ్యకాలంలో కొందరు ఆడవాళ్లు మగవాళ్ళపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. డబ్బు కోసం ఏ పనైనా చేయటానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా ప్రభావం అందరిలో ఉండటంతో.. చాలామంది సోషల్ మీడియాలో వచ్చే మెసేజ్ ల ద్వారా లొంగిపోయి బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. ఇక పురుషులు కూడా అమ్మాయిల నుండి వచ్చే మెసేజ్లకు వెంటనే రెస్పాండ్ అవుతూ లేని సమస్యల్లో ఇరుకుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే తాజాగా హనీ ట్రాప్ ద్వారా ఒక మహిళ ఏకంగా 50 మంది మగవాళ్లను టార్గెట్ చేసి వారిని బెదిరించిన ఘటన చోటు చేసుకుంది. ఇంతకు అసలేం జరిగిందంటే.. బెంగళూరుకి చెందిన ఒక మహిళ హానీ ట్రాప్ ద్వారా పురుషులను బంధించి వారి దగ్గర నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. వెంటనే ఈ విషయం తెలుసుకున్న కర్ణాటక పోలీసులు ఆ దోపిడీ రాకెట్ ను ఛేదించారు. దీంతో ఆ ముఠాలోని ముగ్గురు సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.


పరారీలో ఉన్న కీలక నిందితురాలి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిసింది. ఆ యువతి పేరు నేహా అలియాస్ మేహర్. ఈమె హనీ ట్రాప్ కు పాల్పడిన ప్రధాన నిందితురాలు. ఇక ఈమె మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి సె** రాకెట్ నడుపుతుంది. ఆ మహిళ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ టెలిగ్రామ్ ద్వారా పురుషులను శృంగారం పేరు మీద లొంగ తీసుకొని తన ఇంటికి ఆహ్వానించి.. శృంగారం చేస్తున్న సమయంలో తనతో ఉన్న ముగ్గురు వ్యక్తులతో వీడియో తీయించి.. ఇక ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసుకునే పనిగా పెట్టుకుంది.


Also Read: 3D Printed Post Office: దేశంలోనే తొలి 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసు ప్రారంభం.. ప్రధాని మోదీ ప్రశంసల వర్షం  


ఇక ఆమెతో శృంగారంలో పాల్గొన్న వారితో ఆ ముగ్గురు వ్యక్తులు ఆమెను పెళ్లి చేసుకోవాలని లేదంటే ఇస్లాం మతంలోకి మారాలని లేదంటే డబ్బులు ఇవ్వాలి అని వేధిస్తారని పోలీసుల ద్వారా తెలిసింది. ఇక ఇప్పటివరకు వీళ్లు బ్లాక్మెయిల్ ద్వారా రూ.35 లక్షలకు పైగా వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈ వ్యాపారం దాదాపు ఏడాదిన్నరకు పైగా కొనసాగింది అని తెలిసింది.


ఇక నిందితులలో ముగ్గురు దొరకగా మెహర్ ఆచూకీ ముంబైలో ఉన్నట్లు తాము గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు నిందితుల నుంచి రూ. 60 వేల వరకు రికవరీ చేసినట్లు తెలిసింది. ఇక ఈ వ్యవహారంలో 50 మందికి పైగా పురుషులు ఇరుక్కున్నారని.. ఇక ఆ బాధిత పురుషులలో ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయటం వల్ల ఈ కేసు వెలుగులోకి వచ్చింది అని తెలిసింది. ఇక నిందితులపై తప్పుడు నిర్బంధం, మోసానికి సంబంధించిన భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 348, 420 కింద కేసు నమోదు చేశారు పోలీసులు.


Also Read: CM Jagan Mohan Reddy: ఉద్యోగులకు సీఎం జగన్ శుభవార్త.. దసరా కానుకగా డీఏ ప్రకటన  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి