3D Printed Post Office: దేశంలోనే తొలి 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసు ప్రారంభం.. ప్రధాని మోదీ ప్రశంసల వర్షం

PM Modi on 3D Printed Post Office: 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసు ప్రారంభంపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రతి భారతీయుడు గర్వించాల్సిన క్షణం ఇది అని అన్నారు.   బెంగళూరులోని కేంబ్రిడ్జ్ లేఅవుట్‌లో తొలి 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసును కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు.

Written by - Ashok Krindinti | Last Updated : Aug 18, 2023, 03:34 PM IST
3D Printed Post Office: దేశంలోనే తొలి 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసు ప్రారంభం.. ప్రధాని మోదీ ప్రశంసల వర్షం

PM Modi on 3D Printed Post Office: దేశంలోనే తొలి 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసును ప్రారంభించడం భారతీయులుగా గర్వించాల్సిన విషయమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బెంగళూరులోని కేంబ్రిడ్జ్ లేఅవుట్‌లో మన దేశంలో మొట్టమొదటి 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసును చూసి ప్రతి భారతీయుడు గర్వపడతాడని అన్నారు. మన దేశం ఆవిష్కరణలు పురోగతికి ఇది నిదర్శనమని కొనియాడారు. ఇది స్వావలంబన భారతదేశం స్ఫూర్తిని కూడా ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఈ పోస్ట్ ఆఫీస్‌ కోసం కష్టపడి పనిచేసిన వారికి అభినందనలు తెలిపారు. 3D ప్రిండెంట్ పోస్టాఫీసుకు సంబంధించిన అని ఫొటోలను ట్విట్టర్‌  పంచుకుంటూ ప్రధాని మోదీ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.

బెంగుళూరులో 3డీ-ప్రింటెడ్ పోస్టాఫీసు భవనాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించిన కొద్దిసేపటికే ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. నగరంలోని కేంబ్రిడ్జి లేఅవుట్‌లో 1,021 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన త్రీడీ ప్రింటెడ్ పోస్టాఫీసు భవనం ప్రారంభోత్సవం తర్వాత పనిచేస్తుందని తపాలా శాఖ వెల్లడించింది. ఈ పోస్టాఫీసు భవన నిర్మాణాన్ని నిర్మాణ సంస్థ లార్సెన్ అండ్ టూబ్రో లిమిటెడ్ నిర్వహించగా.. ఐఐటీ మద్రాస్ సాంకేతిక మార్గదర్శకాలను అందించింది.

 

ప్రారంభోత్సవం అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ మాట్లాడుతూ.. అభివృద్ధికి స్ఫూర్తి ఈ పోస్టాఫీసు భవనం నిలుస్తుందన్నారు. మన సాంకేతికతను సొంతంగా అభివృద్ధి చేసుకునే స్ఫూర్తిని కలిగించిందని అన్నారు. ఈ కొత్త నిర్మాణం సాంకేతికత 3డీ-కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా నిర్మించినట్లు తెలిపారు. ఇది పూర్తిగా ఆటోమేటెడ్ భవన నిర్మాణ సాంకేతికతతో రోబోటిక్ ప్రింటర్ కాంక్రీట్ లేయర్-బై-లేయర్‌ను ఆమోదించిన డిజైన్, స్పెషల్ గ్రేడ్ ప్రకారం డిపాజిట్ చేసిందని చెప్పారు. నిర్మాణాన్ని ముద్రించడానికి పొరల మధ్య బంధాన్ని నిర్ధారించడానికి త్వరగా గట్టిపడే కాంక్రీటు ఉపయోగించినట్లు వెల్లడించారు. 3డీ-ప్రింటెడ్ కాంక్రీట్ భవనాన్ని ఆన్-సైట్‌లో నిర్మించడం గొప్ప ప్రయత్న అని అన్నారు. ఐఐటీ మద్రాస్ ఈ నిర్మాణం కోసం బాగా పని చేసిందని అభినందించారు.

సాంప్రదాయ పద్ధతిలో ఈ బిల్డింగ్‌ నిర్మించాలంటే.. దాదాపు ఆరు నుంచి ఎనిమిది నెలల వరకు నిర్మాణ సమయం పడుతుంది. కానీ 3డీ సాంకేతికతో కేవలం 45 రోజుల వ్యవధిలోనే పూర్తయింది. ఖర్చు, సమయం ఆదా చేయడం వల్ల 3డీ-కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ భవిష్యత్‌లో విస్తృతంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 

Also Read: Ind Vs IRE 1st T20: నేడే బుమ్రా రీఎంట్రీ.. ఐర్లాండ్‌తో తొలి టీ20.. కుర్రాళ్లు కుమ్మేస్తారా..?  

Also Read: Cement Block on Railway Track: తప్పిన ఘోర రైలు ప్రమాదం... ఒడిషా తరహా రైలు ప్రమాదానికి భారీ కుట్ర ?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News