MLA Yogesh Shukla Employee Death: ఉత్తరప్రదేశ్‌లో ఓ ఎమ్మెల్యే అధికారిక నివాసంలో యువకుడు ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ శుక్లా అధికారిక నివాసంలో ఓ ఉద్యోగి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని 24 ఏళ్ల శ్రేష్ట తివారీగా గుర్తించారు. నగరంలోని హజ్రత్‌గంజ్ ప్రాంతంలో ఉన్న శుక్లా ప్రభుత్వ నివాసంలో ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. శ్రేష్ఠ తివారీ బారాబంకి జిల్లాలోని హైదర్‌ఘర్ నివాసి. ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా.. మృతికి కారణాలు వెల్లడికాలేదు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లక్నోలోని బక్షి కా తలాబ్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే యోగేష్ శుక్లా మీడియా సెల్‌కు సంబంధించిన పనులను శ్రేష్ఠ తివారీ చూసుకుంటున్నాడని పోలీసులు తెలిపారు. హజ్రత్‌గంజ్‌లోని ఎమ్మెల్యే నివాసం ఫ్లాట్ నంబర్ 804లో శ్రేష్ఠ తివారీ ఒంటరిగా ఉంటున్నట్లు చెప్పారు. ఆదివారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో మీడియా సెల్‌ పని చూసుకుంటున్న ఉద్యోగి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తమకు సమాచారం అందిందని వెల్లడించారు. ఎమ్మెల్యే అధికారిక నివాసంలో ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది.


సంఘటనకు చేరుకున్న పోలీసులు.. తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. శ్రేష్ఠ తివారీ మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కుమారుడి ఆత్మహత్య వార్త మృతుడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. శ్రేష్ట తివారీ ఆత్మహత్య ఘటనపై ఎమ్మెల్యే యోగేష్ ఇంకా స్పందించలేదు. 


ఆత్మహత్యకు పాల్పడే ముందు తెలిసిన వ్యక్తికి ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అవతలి వ్యక్తికి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పినట్లు తెలుస్తోంది. తిరిగి కాల్ చేసినా.. శ్రేష్ట తివారీ లిఫ్ట్ చేయలేదు. మృతుడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ తరువాత విచారణ ముమ్మరం చేయనున్నారు.


Also Read: Vande Bharat Express: ఒక్క రోజులో బెంగుళూరుకు వెళ్లి రావొచ్చు.. 'వందే భారత్' ప్రారంభోత్సవంలో కిషన్ రెడ్డి      


Also Read: Snake Bite: ఒకే కుటుంబంలో ముగ్గురిని కాటు వేసిన పాము.. ఇద్దరు మృతి  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి