Beeda Masthan Rao Daughter: రోడ్డు ప్రమాదం కేసులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు కుమార్తె అరెస్టయ్యారు. కారుతో ఢీకొట్టి ఓ యువకుడు ప్రాణం పోవడానికి ఆమె కారణంగా గుర్తించిన చెన్నై పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రమాదం చేసి అలాగే వేగంగా తప్పించుకుని వెళ్లడంతో పోలీసులు ఆమె కోసం విస్తృతంగా గాలించారు. సీసీ ఫుటేజీ ద్వారా కారును గుర్తించి ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు. అయితే ఈ సంఘటన ఏపీలో హాట్‌ టాపిక్‌గా మారింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Darshan Manager: ఛాలెంజింగ్ స్టార్‌ దర్శన్‌ మేనేజర్‌ ఆత్మహత్య.. సంచలన మలుపు తిరిగిన కేసు


వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా బీద మస్తాన్ రావు ఎంపికయ్యారు. అయితే ఆయన కుమార్తె మాధురి (33) చెన్నైలో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. చెన్నైలోని బసంత్‌ నగర్‌లో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న సూర్య అనే యువకుడి పై నుంచి కారు వెళ్లనిచ్చారు. తీవ్ర గాయాలతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే సంఘటన తర్వాత ఆమె ఆగకుండా కారుతో అలాగే దూసుకెళ్లారు.

Also Read: Auto Seat Issue: ఆటోలో సీటు కోసం గొడవ.. పొరపాటున స్నేహితుడినే చంపిన వైనం


 


స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు కారు నంబర్‌ను ఛేదించారు. ఆ కారు వివరాలు పరిశీలించ వైసీపీ రాజ్యసభ ఎంపీ కూతురు మాధురిగా నిర్ధారించారు. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే వెంటనే ఆమెకు బెయిల్‌ రావడం గమనార్హం. కాగా మృతి చెందిన యువకుడు సూర్యకు పెళ్లయ్యింది. పెయింటర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా అతడి అంత్యక్రియలు మంగళవారం ముగిశాయి. మాధురి అరెస్ట్‌ వార్త ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter