Darshan Manager: ఛాలెంజింగ్ స్టార్‌ దర్శన్‌ మేనేజర్‌ ఆత్మహత్య.. సంచలన మలుపు తిరిగిన కేసు

Darshan Thoogudeepa Manager Sridhar Suicide In Hero Farmhouse: కన్నడ సినీ పరిశ్రమలో చాలెంజింగ్‌ స్టార్‌ దర్శన్‌ వివాహేతర సంబంధం కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. తాజాగా అతడి మేనేజర్‌ ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 18, 2024, 07:07 PM IST
Darshan Manager: ఛాలెంజింగ్ స్టార్‌ దర్శన్‌ మేనేజర్‌ ఆత్మహత్య.. సంచలన మలుపు తిరిగిన కేసు

Darshan Manager: కన్నడ హీరో దర్శన్‌ తూగుదీప కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అతడి మేనేజర్‌ బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఈ కేసు ఊహించని మలుపు తిరిగింది. అయితే అతడు దర్శన్‌ ఫామ్‌హౌస్‌లోనే ఆత్మహత్యకు పాల్పడడం గమనార్హం. ఈ సంఘటనతో పోలీసులు మరింత లోతుగా కేసును విచారిస్తున్నారు.

Also Read: Auto Seat Issue: ఆటోలో సీటు కోసం గొడవ.. పొరపాటున స్నేహితుడినే చంపిన వైనం

 

కన్నడ నటి పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు పంపిన రేణుకా స్వామి హత్య కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నటుడు దర్శన్‌ తూగుదీప ఇప్పటికే అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. అయితే కేసు విచారణలో అతడి మేనేజర్లు కీలకంగా మారారు. వాళ్లు కొన్నాళ్లుగా అదృశ్యం కావడంతో వారిని గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే దర్శన్‌ ఫామ్‌హౌస్‌లో దర్శన్‌ మేనేజర్‌ శ్రీధర్‌ ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. సంఘటన స్థలంలో ఒక సూసైడ్‌ నోట్‌, వీడియో సందేశధం లభించినట్లు సమాచారం.

Also Read: Hajj Pilgrims: హజ్‌ యాత్రలో మృత్యుఘోష.. ఎండ వేడికి తాళలేక పిట్టల్లా రాలుతున్న భక్తులు

 

అయితే సూసైడ్‌ నోటులో మాత్రం శ్రీధర్‌ కొత్త విషయాలు చెప్పాడు. తాను ఒంటరితనం వలన చనిపోతున్నట్లు, తన మరణానికి కారణం ఎవరూ కాదని లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ లేఖపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దర్శన్‌ హత్య కేసు వెలుగులోకి రావడంతోనే శ్రీధర్‌ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పవిత్ర, దర్శన్‌ మధ్య ఏం జరిగిందనేది శ్రీధర్‌కు పూర్తిగా తెలుసని, విచారణలో ఆ విషయాలు చెబుతారనే భయంతో శ్రీధర్‌పై వేధింపులకు పాల్పడి ఆత్మహత్య చేసుకునేలా ప్రయత్నించి ఉంటారని చర్చ జరుగుతోంది.

కేసు ఏమిటంటే..?
కన్నడ చిత్రసీమలో పవిత్ర గౌడ హీరోయిన్‌గా, దర్శన్‌ సినీ నటుడుగా కొనసాగుతున్నారు. అయితే వీరిద్దరూ పదేళ్లుగా సహజీవనంలో ఉన్నారు. అయితే ఈ విషయాలన్నీ తెలుసుకున్న దర్శన్‌ వీరాభిమాని రేణుకా స్వామి తట్టుకోలేకపోయాడు. తన హీరో కాపురంలో పవిత్ర చిచ్చురేపారని ఆగ్రహంతో పవిత్ర ఇన్‌స్టాగ్రామ్‌కు అశ్లీల సందేశాలు చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నాడు. ఇది గ్రహంచి అతడిని దర్శన్‌ హత్య చేయించారు. ఈ హత్య కేసులో దర్శన్‌, పవిత్రతో సహా మొత్తం 15 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News