2018 Movie creates a new milestone in Mollywood: నిజానికి సౌత్ ఇండియాలో ఉన్న మిగతా భాషలలో పోలిస్తే మలయాళ సినీ పరిశ్రమ మార్కెట్ చాలా చిన్నది. తమిళ, కన్నడ, తెలుగు భాషలతో పోలిస్తే మలయాళ సినిమాల బడ్జెట్ మాత్రమే కాదు మార్కెట్ పరిధి కూడా చాలా తక్కువగా ఉండేది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ అదంతా ఒకప్పటి మాట ఇప్పుడు మాత్రం మలయాళ సినిమాల మీద ఇతర భాషల ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో అక్కడి దర్శక  నిర్మాతలు కూడా తమ సినిమాల మీద పెట్టుబడి పెట్టేందుకు భారీ ఎత్తున నిర్మించేందుకు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈమధ్య 2018 పేరుతో రిలీజ్ అయిన ఒక సినిమా అన్ని రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు దూసుకుపోతోంది. టోవినో థామస్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా చిన్న సినిమానే అయినా ఒక భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచి కేరళ బాక్సాఫీస్ ని పట్టి కుదిపేసింది.


Also Read: Malli Pelli Movie Review: నరేష్-పవిత్రాల మళ్లీ పెళ్లి రివ్యూ అండ్ రేటింగ్.. సినిమా ఎలా ఉందంటే?


రిలీజ్ అయి చాలా కాలమే అయినా ఇంకా అక్కడ భారీ వసూళ్లు సాధిస్తూ ముందుకు వెళుతుంది. ఈ సినిమా మే 5వ తారీఖున మలయాళం లో రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా ఇప్పుడు మలయాళ సినీ పరిశ్రమలో అత్యధిక కలెక్షన్లు సాధించి మొదటి స్థానంలో ఉన్న పులిమురుగన్ సినిమా వసూళ్ల రికార్డును బద్దలు కొట్టి మొదటి స్థానానికి వెళ్ళింది.


ఈరోజుతో ఈ సినిమా 150 కోట్ల గ్రాస్ కలెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసే అంచనాలు ఉన్నాయి. ఇక అలా ప్రపంచవ్యాప్తంగా మలయాళంలో రిలీజ్ అయ్యి కేవలం మలయాళ వెర్షన్ లోనే 150 కోట్లు కలెక్ట్ చేసిన మొదటి సినిమాగా కూడా ఇది నిలవనుంది. నిజానికి 2018 సినిమా ఈ రోజే తెలుగు సహా తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ అవుతుంది. ఆ కలెక్షన్లు కూడా ఈ సినిమా మరింత ముందుకు దూసుకు వెళ్లేందుకు అవకాశాలు కల్పించనున్నాయి. 2018 లో జరిగిన కేరళ వరదలు నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమాని అక్కడి ప్రేక్షకులు అందరూ ఓన్ చేసుకున్నారు. 


Also Read: Mem Famous Review: మహేష్ మెచ్చిన మేం ఫేమస్ రివ్యూ & రేటింగ్.. ఎలా ఉందంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK