Malli Pelli Movie Review: నరేష్-పవిత్రాల మళ్లీ పెళ్లి రివ్యూ అండ్ రేటింగ్.. సినిమా ఎలా ఉందంటే?

Malli Pelli Review: నటుడు నరేష్, పవిత్ర లోకేష్ జంటగా తెరకెక్కిన మళ్లీ పెళ్లి అనే సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం.  

Written by - Chaganti Bhargav | Last Updated : May 26, 2023, 04:39 PM IST
Malli Pelli Movie Review: నరేష్-పవిత్రాల మళ్లీ పెళ్లి రివ్యూ అండ్ రేటింగ్.. సినిమా ఎలా ఉందంటే?

Malli Pelli Movie Review: నటుడు నరేష్, పవిత్ర లోకేష్ జంటగా మళ్లీ పెళ్లి అనే సినిమా రూపొందిస్తున్నట్లు ప్రకటన వచ్చినప్పటి నుంచే ఆ సినిమా మీద అందరిలోనూ ఆసక్తి నెలకొంది. దానికి తోడు నరేష్, పవిత్ర లోకేష్ నిజ జీవిత ఘటనల ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలిసినప్పటి నుంచి ఈ సినిమా ఎలా ఉండబోతోంది? అని అందరిలోనూ అంచనాలు పెరిగిపోయాయి. అలా మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ విపరీతంగా ట్రెండ్ అయిన మళ్లీ పెళ్లి సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది అనేది రివ్యూలో చూద్దాం.

మళ్లీ పెళ్లి కథ విషయానికి వస్తే
తెలుగు సినీ పరిశ్రమలో నటుడు నరేంద్ర(నరేష్) చాలా సీనియర్. ఒక షూటింగ్లో కన్నడ నటి అయిన పార్వతి(పవిత్ర లోకేష్)తో పరిచయం ఏర్పడుతుంది. మొదట్లో ఏమీ అనిపించదు కానీ రోజులు గడుస్తున్న కొద్దీ వారి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. అప్పటికే నరేంద్రకు మూడు పెళ్లిళ్లు అవ్వడం ముగ్గురు తోను పొసగకపోవడంతో పర్సనల్ లైఫ్ వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అదే సమయంలో పార్వతి కూడా తన భర్త ఫణీంద్ర(రవి వర్మ)తో సఖ్యతగా ఉండలేక పోతుంది. వారిద్దరూ తమ తమ సమస్యలు చెప్పుకొని ఒకరికొకరు దగ్గరవుతారు. అయితే ఒకపక్క నరేంద్ర మూడవ భార్య సౌమ్య సేతుపతి(వనితా విజయ్ కుమార్) ఆస్తి కోసం నరేంద్రని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. పార్వతితో కలిసి ఉన్నాడనే విషయం తెలుసుకొని నరేంద్రను మీడియాకు లాగాలని ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో సౌమ్య సేతుపతి విజయం సాధించిందా? నరేంద్ర పార్వతి ఒకటయ్యారా? ఈ సమయంలో పార్వతి భర్త ఫణీంద్ర ఏం చేశాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ
ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే ఇది నటి పవిత్ర లోకేష్, నటుడు నరేష్ మధ్య జరిగిన కొన్ని సంఘటనల సమాహారం. సినిమాగా చెబుతున్నారు కానీ వెబ్ సిరీస్ గా అయితే కరెక్ట్ గా సూట్ అయ్యేది. ఇది బయోపిక్ కాదని నరేష్ చెబుతున్నా పూర్తిగా నరేష్, పవిత్ర లోకేష్, నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి, పవిత్ర లోకేష్ భర్త సుచేంద్ర, కన్నడ మీడియా సంస్థ అధినేత రాకేష్ శెట్టి వంటి వాళ్ళ పేర్లన్నీ మార్చి ప్రస్తావించారు. ఆయా పాత్రలను ఏమాత్రం మార్పులు చేర్పులు లేకుండా చూపించారు. వాస్తవానికి నరేష్, పవిత్ర లోకేష్ మధ్య సాన్నిహిత్యం ఉందని వారిద్దరూ సహజీవనం చేస్తున్నారనే వార్తలు మాత్రమే మీడియాకి తెలుసు. ఆ తర్వాత రమ్య రఘుపతి మీడియాకెక్కి ఆరోపణలు చేయడం ఆమె మీద నరేశ్ ఆరోపణలు చేయడం, ఇలా సాగుతూ పోయింది.

Also Read: Dimple Hayathi: డింపుల్ హయాతికి ప్రాణి హాని.. బయటకు రావాలన్నా భయపడి పోతున్న హీరోయిన్

అయితే పవిత్ర లోకేష్ తో తన బంధం ఏర్పడడానికి అసలు కారణం ఏమిటి? పవిత్రకు తన దాంపత్య జీవితంలో ఉన్న ఇబ్బందులు ఏమిటి? లాంటి విషయాలను ప్రజలకు వివరించేందుకు ఈ సినిమా తెరకెక్కించినట్లు అనిపిస్తుంది. దాదాపుగా జరిగిన సంఘటనలన్నీ మనం ఇంతకుముందే మీడియా ముఖంగా చూసే ఉన్నాం. కానీ ఈ సినిమా ద్వారా తాను పూర్తిగా ఎలాంటి తప్పు చేయలేదు. పరిస్థితుల ప్రభావం వల్ల ఇద్దరు భార్యలకు విడాకులు ఇవ్వడమే కాదు మూడో భార్యకి కూడా దూరమయ్యాను, ఆ సమయంలో పవిత్ర లోకేష్ తనకు ఒక మంచి స్నేహితురాల్లా దొరికింది అని నరేష్ చెప్పుకునే ప్రయత్నమే ఈ సినిమా. అయితే ముందు నుంచి నరేష్ ఏవైతే ఆరోపణలు చేశారో అవే ఆరోపణలను సినిమా ముఖంగా ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేశారు. అయితే అది కొన్ని చోట్ల మరీ ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. తన భార్య రమ్యారఘుపతి మీద ఆరోపణలన్నీ కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రయత్నంగా ఈ సినిమా చేసినట్లు అనిపిస్తుంది.

నటీనటులు విషయానికి వస్తే 
ఈ సినిమాలో నరేంద్ర పాత్రలో నరేష్, పార్వతి పాత్రలో పవిత్ర లోకేష్, ఫణీంద్ర పాత్రలో రవి వర్మ, సౌమ్య సేతుపతి పాత్రలో వనిత విజయ్ కుమార్, కృష్ణ పాత్రలో శరత్ బాబు, విజయనిర్మల పాత్రలో జయసుధ వంటి వారు కనిపించారు. ఇక పవర్ టి వి అధినేత రాకేష్ శెట్టి పాత్రలో ప్రవీణ్ యండమూరి కనిపించారు. దాదాపుగా వీరంతా తమ తమ పాత్రల పరిధి మేరకు నటిస్తే నరేష్, పవిత్ర లోకేష్ మాత్రం తమ నిజ జీవిత పాత్రలే కావడంతో ఎక్కడా నటించినట్లు అనిపించదు పూర్తిస్థాయిలో వారిద్దరు జీవించేశారని చెప్పాలి. అయితే కొన్ని కొన్ని ఎమోషనల్ సీన్స్ లో నరేష్ ముఖ కవలికలు ఎందుకో ఎబ్బెట్టుగా అనిపించాయి. ఆయన తన పాత్రను ఓన్ చేసుకున్నారో లేక ఇబ్బందిగా ఫీల్ అయ్యారో తెలియదు కానీ కొన్ని చోట్ల మాత్రం ఆయన హావభావాలు వింతగా అనిపించాయి.

టెక్నికల్ టీం విషయానికి వస్తే 
ఇందులో ఎమ్మెస్ రాజు మార్క్ ఎక్కడా కనిపించలేదు. బహుశా నరేష్ సినిమా మొత్తం తీసేసి దానికి ఎమ్మెస్ రాజు పేరు తగిలించారేమో అని అనుమానాలు కలగక మానవు. సినిమా మొత్తం ఒక వెబ్ సిరీస్ లాగా సాగుతూ వెళ్ళిపోతుంది. అయితే నరేష్, పవిత్ర లోకేష్ క్రేజ్ వల్ల వారిద్దరి కెమిస్ట్రీ స్క్రీన్ మీద బాగా వర్కౌట్ అయింది. వారిద్దరూ ఎప్పుడు కనిపించినా డైలాగులు వినిపించినా ప్రేక్షకుల్లో ఏదో తెలియని ఉత్సాహం అయితే కనిపిస్తోంది. సినిమాటోగ్రఫీ సినిమాకి తగ్గట్టు సరిపోయింది. ఎడిటింగ్ కూడా వంక పెట్టలేని విధంగా సరిగ్గా నప్పింది. అయితే పెద్దగా గుర్తుపెట్టుకునే పాటలు అయితే లేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ఆకట్టుకుంది.
 
ఫైనల్ గా ఒక్కమాటలో చెప్పాలంటే
ఈ మళ్లీ పెళ్లి సినిమా నరేష్ తాను నిర్దోషినని నిరూపించుకునే ప్రయత్నమే తప్ప ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏమీ లేవు. 

Rating: 2/5

Also Read: 2018 Telugu Review: మలయాళంలో కోట్లు కొల్లగొట్టిన '2018' రివ్యూ -రేటింగ్.. ఎలా ఉందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News