Marathi Actress Ishwari Deshpande Dies In A Car Accident: ప్రియుడితో కలిసి హాలీడే ట్రిప్‌కు వెళ్లిన నటి ఈశ్వరి దేశ్‌ పాండే కారు ప్రమాదం(Car Accident)లో మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మరాఠీ నటి ఈశ్వరి ప్రియుడితో కలిసి సెప్టెంబర్‌ 15న గోవా హాలీడే ట్రిప్‌(Goa holiday Trip)కు వెళ్లింది. సోమవారం తెల్లవారుజామున వీరు ప్రయాణిస్తున్న కారు అర్పారో గ్రామానికి సమీపంలోని బాగా-కలాంగుట్‌ వంతెనపై అదుపుతప్పి లోయలోకి పడిపోయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కారు సెంట్రల్‌ లాక్‌ చేసి ఉండటంతో ఇద్దరూ కారులోంచి బయటకు రాలేకపోయారు. ఈ ప్రమాదంలో ఈశ్వరి(25)తో పాటు ఆమె ప్రియుడు శుభమ్ డెడ్జ్ (28) ప్రాణాలు కోల్పోయారు.  చిన్నప్పటి నుంచి నటిగా రాణించాలని కలలు కన్న ఈశ్వరి దేశ్‌ పాండే(Ishwari Deshpande) హిందీ, మరాఠీ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె చేసిన సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.


Also Read: Actress payal ghosh: పాయల్‌ ఘోష్‌ పై యాసిడ్‌ దాడి! నటికి గాయాలు..


అయితే శుభమ్‌(Shubham Dedge)తో ఈశ్వరికి చాన్నాళ్లుగా పరిచయం ఉంది. వీరి స్నేహం ఇటీవలె ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో వీరి నిశ్చితార్థానికి (Engagement)కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో కారు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ట్రిప్‌కి వెళ్లి సంతోషంగా తిరిగి వస్తారనుకుంటే శవమై తేలడం బంధువులను, స్నేహితులను షాక్‌కి గురిచేస్తుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook