Rajendra Prasad: లెజెండ్రీ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న రాజేంద్రప్రసాద్ ఇటీవల తన కుమార్తెను కోల్పోయిన విషయం తెలిసిందే.  శుక్రవారం రోజు ఛాతీ లో నొప్పి రావడంతో హుటా హుటిన హాస్పిటల్ లో చేర్పించగా.. గంట చికిత్స తర్వాత ఆమె తుది శ్వాస విడిచినట్లు వైద్యులు నిర్ధారించారు. అతి చిన్న వయసులోనే గాయత్రి మరణాన్ని రాజేంద్రప్రసాద్ జీర్ణించుకోలేకపోతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాధను దిగమింగుకొని కూతురి అంత్యక్రియలను ఆయన దగ్గరుండి మరి పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే రాజేంద్రప్రసాద్ ను పరామర్శించడానికి పలువురు సెలబ్రిటీలు ఆయన ఇంటికి వెళ్లి మరీ పరామర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ కూడా తాజాగా రాజేంద్రప్రసాద్ ఇంటికి వెళ్లారు. 


రాజేంద్రప్రసాద్ ను కలిసిన ప్రభాస్ కూతురి చిత్రపటానికి 
పువ్వులు సమర్పించి,  ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ ను పరామర్శించారు.  గాయత్రి మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని , ఆయన వెల్లడించినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్,  రాజేంద్రప్రసాద్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించడంతో ఇందుకు సంబంధించిన వీడియోలు,  ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.  ఇవి చూసిన నెటిజన్స్ కూడా ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


ఇక ప్రభాస్ విషయానికొస్తే.. ఇటీవల కల్కి 2898 ఏడి చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈయన, ఈ సినిమాతో ఏకంగా రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డు సృష్టించారు. ఈ సినిమా  తర్వాత రాజా సాబ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మరోపక్క స్పిరిట్, కల్కి 2, సలార్ 2 వంటి చిత్రాలు లైన్లో పెట్టారు.  అంతేకాదు హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే చిత్రం కూడా చేస్తున్న విషయం తెలిసిందే.


ప్రస్తుతం వచ్చే యేడాది ఏప్రిల్ లో తాను నటిస్తున్న రాజా సాబ్ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షూటింగ్ వేగంగా జరుపుతున్నారు. ప్రస్తుతం షూటింగ్లో పాల్గొంటున్న ఈయన అక్కడ బిజీగా ఉన్నా.. ఇక్కడ రాజేంద్రప్రసాద్ ను  పరామర్శించడానికి తన పనులు అన్నింటిని పక్కనపెట్టి నేరుగా ఇక్కడికి రావడంతో ఆయన మంచి మనసు పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.


 



 


ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!


ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter